• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీవిష్ణు మరొకటి.. 60%...

శ్రీవిష్ణు మరొకటి.. 60% షూటింగ్ కూడా..

| టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-04-17 07:37 GMT

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది సామజవరగమనతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఇటీవల ఓం భీమ్ బుష్ తో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ వరుసగా ఆసక్తికరమైన సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం ఉగాది పండుగ సందర్భంగా కొత్త మూవీ అనౌన్స్ చేశారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తుండగా.. డైరెక్టర్ బాబీ కొల్లి ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక నేడు శ్రీరామ నవమి పురస్కరించుకుని మరో సినిమాను ప్రకటించారు ఈ యంగ్ హీరో. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి ఇటీవల వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అప్డేట్ వచ్చింది. సామజవరగమనలో శ్రీవిష్ణుకి జోడీగా నటించిన రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయింది. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా డైరెక్టర్ హుస్సేన్ షా కిర‌ణ్.. లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు అని టాక్.

ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు, రెబా జాన్ తోపాటు వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. కాల భైర‌వ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక.. శ్రీవిష్ణు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజ రాజ చోర వంటి హిట్‌ చిత్రాన్ని తనకు అందించిన దర్శకుడు హసిత్‌ గోలితో శ్వాగ్ మూవీ చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి వరుస చిత్రాలతో శ్రీవిష్ణు.. ఎలాంటి హిట్లు అందుకుంటారో చూడాలి.

My next :)

The chase begins under @HussainShaKiran ❤️

Will meet you all again with a fully packed chill entertainer … until then, keep tracking the clues 😉@Reba_Monica @HussainShaKiran @kaalabhairava7 @sreekar_prasad @vidya7sagar @SunnyGunnam @VKC001 @Lightboxoffl… pic.twitter.com/AmGzG4QI01

— Sree Vishnu (@sreevishnuoffl) April 17, 2024
Tags:    
  • Hussainshakiran 
  • Sreevishnu 
  • Tollywood 
  • SV17 
  • Sreevishnunext 
  • Janakirammarella 
  • Sreevishnumovie 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS