• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆయ్ కోసం గ్లామర్ టచ్.....

ఆయ్ కోసం గ్లామర్ టచ్.. రంగంలోకి స్టార్ బ్యూటీ

| అయితే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్ శ్రీలీల రాబోతుందని కన్ఫర్మ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-08-12 12:02 GMT

గీతా ఆర్ట్స్ 2 నుంచి ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఆయ్. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గోదావరి బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాతో నయన సారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అంజిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 

సాంగ్స్ అన్ని కూడా చక్కనైన తెలుగు నేటివిటీతో అందరిని ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్ కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. దీంతో మూవీపైన అంచనాలు పెరిగాయి. రెండు పెద్ద సినిమాల మధ్య వస్తోన్న కూడా ఈ ఆయ్ మూవీ పైనే ప్రేక్షకులలో ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. చిత్ర నిర్మాత బన్నీ వాస్ కూడా మూవీని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.

కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో బన్నీ వాస్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆగష్టు 13న జరగబోతోంది. హోటల్ దసపల్లాలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. నిజానికి ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ లుగా వస్తారనే ప్రచారం నడిచింది.

అయితే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్ శ్రీలీల రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోందంట. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో గ్రాండ్ గానే చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రియాస్ మీడియా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఆయ్ ఈవెంట్ కి రావాలనుకున్న వారు శ్రియాస్ మీడియా వెబ్ సైట్స్ లోకి వెళ్లి పాస్ లు బుక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.

అలాగే ఈ మూవీ ప్రీమియర్స్ కూడా బన్నీ వాస్ ఆగష్టు 15న మార్నింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాడ్ సినిమా సక్సెస్ తో జోరు మీదున్న నార్నె నితిన్ ఆయ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఈ మూవీ హిట్ అయితే హీరోగా అతని మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. శ్రీలీల చీఫ్ గెస్ట్ గా రాబోతుండటంతో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కాస్తా గ్లామర్ టచ్ వస్తోందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది.

Tags:    
  • Sreeleela 
  • Aay 
  • Aaymovie 
  • Prereleaseevent 
  • Geethaarts 
  • Nithin 
  • Bunnyvas 
  • Gunturkaram 
  • Alluaravind 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

Copyright @2026

Powered by Blink CMS