క్రికెటర్‌తో ప్రేమాయణం? శ్రీలీల తల్లి క్లారిటీ ఇదే..
అలాగే ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ కు శ్రీలీల హాజరుకావడం వార్తలకు మరింత బలం చేకూర్చింది.
యంగ్ అండ్ స్టార్ బ్యూటీ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ రూమర్లు మరింత జోరందుకోవడంతో శ్రీలీల తల్లి స్వర్ణలత రెస్పాండ్ అయ్యారు. ఆ విషయంపై కంప్లీట్ గా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. శ్రీలీల ప్రస్తుతం తన సినీ కెరీర్ తో పాటు చదువుపైనా దృష్టి పెట్టిందని స్వర్ణలత తెలిపారు. ముఖ్యంగా ఆమె నీట్-పీజీ పరీక్షలకు సిద్ధమవుతోందని చెప్పారు. వ్యక్తిగత విషయాలు, పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించడానికి ఇంకా ఐదారు సంవత్సరాల సమయం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి రూమర్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని చెప్పారు.
అసలు ఆ వార్తల్లో కొంచెం కూడా నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో శ్రీలీల, తిలక్ వర్మ ఒకే ప్రాంతాల్లో కనిపించడం ఆ ప్రచారానికి కారణమైంది. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో తిలక్ వర్మ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో కనిపించారు.
అప్పట్లో ఇది యాదృచ్ఛికం అని భావించినప్పటికీ, తర్వాత సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అదే విధంగా ఐపీఎల్ మ్యాచుల సమయంలో కూడా ఆ రూమర్లు మరింత పెరిగాయి. ముంబై ఇండియన్స్ మ్యాచ్ లకు శ్రీలీల కుటుంబ సభ్యులు హాజరయ్యారని, స్టేడియంలో తిలక్ వర్మ పేరుతో ఉన్న జెర్సీలు కనిపించాయని నెటిజన్లు చర్చించుకున్నారు. ధర్మశాలలో పంజాబ్ కిం గ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి స్వర్ణలత కనిపించారంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.
అలాగే ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ కు శ్రీలీల హాజరుకావడం వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఆ పరిణామాలన్నింటి నేపథ్యంలో వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటినీ స్వర్ణలత పూర్తిగా కొట్టిపారేశారు. యాదృచ్ఛిక సంఘటనలను ఆధారంగా చేసుకుని కథలు అల్లవద్దని ఆమె కోరారు.
అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్తో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరిగినప్పుడు కూడా స్వర్ణలత స్పందించారు. తాను, కార్తిక్ తల్లి ఇద్దరూ గైనకాలజిస్టులమని, ప్రొఫెషన్ కారణంగా కలుసుకునే సందర్భాలు ఉంటాయని చెప్పారు. కానీ వాటిని తప్పుగా అర్థం చేసుకుని డేటింగ్ వార్తలు రాశారని వివరణ ఇచ్చారు.
కాగా.. ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మరోవైపు తిలక్ వర్మ కూడా భారత జట్టులో తన ప్లేస్ ను స్ట్రాంగ్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై శ్రీలీల మదర్ ఇచ్చిన క్లారిటీతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాలి.