శ్రీలీలలో మార్పు.. ఇష్టం లేకపోయినా సరే అలా..!
స్టార్ హీరోయిన్ శ్రీలీల నెక్స్ట్ మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా తర్వాత రవితేజ తో కలిసి శ్రీలీల చేసిన సినిమా ఇది.;
స్టార్ హీరోయిన్ శ్రీలీల నెక్స్ట్ మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా తర్వాత రవితేజ తో కలిసి శ్రీలీల చేసిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా మీద చాలా హైప్ ఉంది. ఐతే మాస్ జాతరలో తనది ఒక ప్రత్యేకమైన పాత్ర అంటుంది అమ్మడు. మాస్ పాత్రలు చేయాలని ఉంటుంది కానీ తనకు అలాంటి రోల్స్ రావట్లేదని చెబుతుంది శ్రీలీల. ఇక ఈమధ్య తన లుక్ లో మార్పుల వెనక సీక్రెట్ బయట పెట్టింది శ్రీలీల.
లుక్ మీద చాలా ఫోకస్ చేస్తున్నట్టు..
వరుస స్టార్ సినిమాలతో బిజీ అయిన శ్రీలీల సరైన డైట్ పాటించక కాస్త బొద్దుగా మారింది. అంతేకాదు ఆమెకు అమ్మమ్మ వాళ్లు చేసే అరిసెలు అంటే చాలా ఇష్టమట. ఒంగోలు నుంచి అరిసెలు వస్తే మొత్తం ప్యాకెట్ తినేదాకా లేచేది కాదట శ్రీలీల. ఐతే ఇప్పుడు అలా తినడం మానేసి తన లుక్ మీద చాలా ఫోకస్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది శ్రీలీల. అందుకే ఈమధ్య అమ్మడు పూర్తిగా స్లిమ్ లుక్ అయ్యింది. ఫుడ్ విషయంలో కండీషన్స్ అప్లై చేసుకుంటున్నా.. ఒక డాక్టర్ గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని తెలుసు కాబట్టి అలాంటి ఫుడ్ తోనే మెయింటైన్ చేస్తున్నా అంటుంది శ్రీలీల.
తనను చూడటానికి థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి బాగా కనిపించాలి కదా అంటూ తనలో ఈ మార్పు వెనక రీజన్ చెప్పింది శ్రీలీల. రవితేజ మాస్ జాతరలో శ్రీలీల నిజంగానే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో శ్రీలీల తెరంగేట్రం చేసింది. కార్తీక్ ఆర్యన్ తో ఆమె చేస్తున్న సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.
గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు అభినయానికి ప్రాధాన్యత..
తెలుగులో టాప్ స్టార్స్ తో నటిస్తున్న శ్రీలీల తనకు పోటీగా వస్తున్న భామలకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు ఇక మీదట గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యింది. ఐతే శ్రీలీల అనగానే ఆడియన్స్ అందరికీ ఆమె డాన్స్ మాత్రమే గుర్తొచ్చేలా చేసిన ఈ అమ్మడు లేటెస్ట్ స్లిం లుక్ తో మరింత సర్ ప్రైజ్ చేస్తుంది.
సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్స్ చాలా తక్కువ ఉన్నారు. ఐతే శ్రీలీల మాత్రం తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ఉండేలా చూస్తుంది. కార్తీక్ ఆర్యన్ తో తొలి సినిమా సైన్ చేసిన అమ్మడు మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీలీల అటు తమిళ్ లో కూడా పరాశక్తి సినిమాలో ఛాన్స్ అందుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ మురళి కూడా నటించారు.