అక్కడ ఛాన్స్ సరే.. టార్గెట్ రీచ్ అవుతుందా లేదా..?

తెలుగులో రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంది శ్రీ లీల. ధమాకా హిట్ తర్వాత వరుస సినిమాలు చేసిన అమ్మడు సరైన ఫలితాలు రాబట్టుకోలేదు.;

Update: 2025-11-06 05:43 GMT

తెలుగులో రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంది శ్రీ లీల. ధమాకా హిట్ తర్వాత వరుస సినిమాలు చేసిన అమ్మడు సరైన ఫలితాలు రాబట్టుకోలేదు. ఐతే అమ్మడు మాత్రం ఇప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతరతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూసినా కూడా అది జరగలేదు. ఐతే శ్రీలీల తెలుగుతో పాటు హిందీలో సినిమాలు చేస్తుంది. తమిళ్ లో తొలి సినిమా పరాశక్తితో వస్తుంది.

శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా..

శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. తమిళ్ లో శ్రీలీలకు తొలి అవకాశం గా పరాశక్తి వచ్చింది. ఈ సినిమాతో ఎలాగైనా కోలీవుడ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేయాలని చూస్తుంది. తెలుగు సినిమాల్లో శ్రీలీల డ్యాన్స్ లకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కానీ యాక్టింగ్ పరంగా ఆమెకు సరైన గుర్తింపు రావట్లేదు.

అందుకే కోలీవుడ్ లో కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ లీల బలమైన పాత్రలు, యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ తో మెప్పించాలని చూస్తుంది. పరాశక్తి సినిమాతో శ్రీ లీల తమిళ్ లో తన సత్తా చాటాలని చూస్తుంది. సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా రీసెంట్ గా పరాశక్తి నుంచి ఒక సాంగ్ కూడా రిలీజైంది.

శ్రీ లీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో..

పరాశక్తి సినిమా 2026 సంక్రాంతి రేసులో రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాతో శివ కార్తికేయన్ భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. శ్రీ లీల కూడా ఈ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకుంది. శ్రీ లీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తుంది. అక్కడ కూడా అమ్మడు తన డ్యాన్స్ అండ్ యాక్టింగ్ తో బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది. శ్రీ లీల టాలెంట్ ని పర్ఫెక్ట్ గా వాడుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది అమ్మడు. తమిళ్ లో పరాశక్తితో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చేలా ఉంది.

కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైం లోనే కాస్త ఎక్కువ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పరాశక్తి విషయంలో శ్రీలీల మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీలీలకు కచ్చితంగా తమిళ్ లో వరుస ఛాన్స్ లు వచ్చి తీరేలా ఉన్నాయి. శివ కార్తికేయన్ మదరాసి మిస్ ఫైర్ అయ్యింది కాబట్టి పరాశక్తితో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. ఆకాశమే హద్దు సినిమాతో మెప్పించిన డైరెక్టర్ సుధా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News