శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. ఇది ఊహించని షాక్?

స్టార్ హీరోలతో వరుసగా ఛాన్స్ లు అందుకున్న అమ్మడు.. ఒక్కసారిగా ఫ్లాపులు అందుకుంది.;

Update: 2025-08-20 14:30 GMT

యంగ్ హీరోయిన్ శ్రీలీలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఆమె.. టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే ఎక్కువ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక్కసారి సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. ఒకే ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాలు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

స్టార్ హీరోలతో వరుసగా ఛాన్స్ లు అందుకున్న అమ్మడు.. ఒక్కసారిగా ఫ్లాపులు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు బోల్తా కొట్టడంతో కాస్త అవకాశాలు తగ్గాయి. కానీ క్రేజ్ అలానే ఉంది. ఇప్పుడు మళ్లీ జోరు పెంచిన శ్రీలీల.. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుందని క్లియర్ గా తెలుస్తోంది.

అయితే త్వరలో బాలీవుడ్ లోకి శ్రీలీల అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీ దిలేర్ల తో తెరంగ్రేటం చేయనుంది అమ్మడు. మొదటి నుంచి డైరెక్షన్ పై ఫోకస్ చేసిన ఇబ్రహీం అలీ ఖాన్.. ఇప్పుడు హీరోగా బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు.

దిలేర్ చిత్రానికి కృణాల్ దేశ్‍ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ మాడాక్ ఫిల్మ్స్ సంస్థ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతుండగా.. సరైన మూవీతో హిందీలో శ్రీలీల లాంచ్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా థియేటర్స్ లోకి కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి రానుందని వినికిడి.

అయితే అది శ్రీలీలకు ఇది పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. డెబ్యూ మూవీ ఓటీటీలోకి అంటే కాస్త ఆమోదించాల్సిన విషయం కాదు. పలు విషయాల వల్ల మేకర్స్ అలా చేస్తున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఆ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు మంచి ఛాన్స్ మిస్ అవుతుందని అంటున్నారు.

అదే సమయంలో సినిమా రిజల్ట్ తేడా కొడితే డిజిటల్ విడుదల ఆమెను పరాజయం నుంచి కాపాడవచ్చని చెబుతున్నారు. అయితే దిలేర్ ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయితే శ్రీలీల బాలీవుడ్ బిగ్ స్క్రీన్ లాంచ్ కార్తీక్ ఆర్యన్ తో ఆమె చేస్తున్న రొమాంటిక్ డ్రామాకు మారవచ్చు. ఇది కచ్చితంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఆ ప్రాజెక్ట్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News