చెన్నైలో పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి తన ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-05-11 17:30 GMT

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి తన ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కెరీర్, చదువు, వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి గురించి శ్రీలీల చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో కొత్త చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటుల పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో శ్రీలీల వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్ కు హాజరైన శ్రీలీల స్టూడెంట్స్ తో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమెకు కోలీవుడ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కాలేజ్ లోని స్టూడెంట్స్ శ్రీలీల‌ను లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవగా దానికి ఆమె వెంట‌నే రియాక్ట్ అవుతూ, ఆ ట్యాగ్‌కు అసలైన అర్హురాలు నయనతార అని చెప్పారు. నయనతార తనకు ఎంతో ఇష్టమైన నటి అని, ఆమె కెరీర్, వ్యక్తిత్వం తనకు ఇన్సిపిరేష‌న్ అని వెల్లడించారు. అదే సమయంలో చెన్నై గురించి మాట్లాడిన శ్రీలీల అక్కడి ప్రజల ప్రేమ, ముఖ్యంగా చెన్నై దోశ తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ క్రమంలోనే నయనతార లాగానే తాను కూడా చెన్నైలో పెళ్లి చేసుకుంటానా లేదా అనేది మాత్రం త‌న‌కు తెలియదంటూ నవ్వుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే శ్రీలీల చేసిన ఈ కామెంట్స్‌ను నెటిజన్లు తమదైన రీతిలో విశ్లేషిస్తున్నారు. కొందరు ఆమె సరదాగా మాట్లాడిందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ కామెంట్స్ వెనుక ఏదైనా స్పెష‌ల్ రీజ‌న్ ఉందా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. శ్రీలీల కామెంట్స్ విన్న త‌ర్వాత తమిళనాడుకు కోడలిగా వెళ్లబోతుందా?, చెన్నై వ్యక్తితో ల‌వ్ లో ఉందా లాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు శ్రీలీల తన ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై స్పందించిన సందర్భాలు తక్కువ‌. గతంలో కూడా ఆమె పెళ్లి, రిలేషన్‌షిప్‌పై పలు రూమర్స్ వచ్చినప్పటికీ వాటిని ఆమె ఖండించారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకంటే కథలో ప్రాధాన్యం ఉన్న సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో పెళ్లి గురించి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News