శ్రీలీల ప్లాన్ మార్చక తప్పట్లేదా..?

ధమాకా బ్యూటీ శ్రీలీల ఈమధ్య కెరీర్ లో వెనకబడింది. తెలుగులో వరుస స్టార్ సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ శ్రీలీల స్టార్ రేంజ్ అందుకోలేదు.;

Update: 2026-01-10 05:51 GMT

ధమాకా బ్యూటీ శ్రీలీల ఈమధ్య కెరీర్ లో వెనకబడింది. తెలుగులో వరుస స్టార్ సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ శ్రీలీల స్టార్ రేంజ్ అందుకోలేదు. అంతేకాదు ఈమధ్య వరుస ఫ్లాపులు ఆమెకు ఛాన్స్ లు కూడా లేకుండా చేశాయి. గుంటూరు కారం తర్వాత రవితేజ తో మాస్ జాతర చేసిన శ్రీలీల ఆ సినిమా ధమకా రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందని అనుకుంటే అది జరగలేదు. ఐతే పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది కాబట్టి అమ్మడు ఇంకా తెలుగులో హోప్స్ వదులుకోలేదు.

స్టార్ సినిమాల్లో డాన్స్ ల కోసమే..

ఐతే ఇప్పుడు అమ్మడు తమిళ్ లో తెరంగేట్రం చేస్తుంది. శివ కార్తికేయన్ తో కలిసి పరాశక్తి సినిమాలో నటించింది శ్రీలీల. తమిళ్ లో ఆమె మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం. శ్రీలీల డాన్స్ లు అదరగొట్టేస్తుంది. స్టార్ సినిమాల్లో ఆమెను డాన్స్ ల కోసమే అన్నట్టుగా తీసుకుంటున్నారు. ఐతే తమిల్ ఎంట్రీ ఇవ్వడమే ఒక మంచి క్యారెక్టర్ తో వస్తుంది శ్రీలీల. పరాశక్తిలో శ్రీలీల రోల్ ఆమె రెగ్యులర్ గా చేసే పాత్ర అయితే కాదని తెలుస్తుంది.

సినిమాలో ఆమె రోల్ కూడా బలంగా ఉంటుందట. ఇన్నాళ్లు సినిమాలు చేస్తున్నాం అవి ఆడేస్తున్నాయ్ అన్న భావన లో ఉన్న శ్రీలీల ఆడియన్స్ మీద ఒక ఇంపాక్ట్ చూపించాలని ఇప్పుడు అనుకుంటుంది. ఫలానా సినిమాలో ఆ హీరోయిన్ బాగా చేసింది అసలు ఆమె నటన అద్భుతం అని అనిపించుకునేలా పాత్రలు చేయాలని అనుకుంటుందట. అలాంటి పాత్రలకు తొలి అడుగుగా శ్రీలీల పరాశక్తి చేసింది.

శ్రీలీల సినిమాలో ఉందంటే..

డాన్స్ తో అదరగొట్టే శ్రీలీల బలమైన పాత్ర పడితే కచ్చితంగా తను కూడా నటిగా ప్రూవ్ చేసుకుంటుంది. పరాశక్తిలో శ్రీలీల రోల్ క్లిక్ అయితే మాత్రం అమ్మడికి ఇక అలాంటి రోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. శ్రీలీల సినిమాలో ఉందంటే డాన్స్ అదిరిపోతుంది అనే కాదు ఇక మీదత ఆమె ఉంది అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది అనిపించేలా చేయాలని చూస్తుందట. తప్పకుండా శ్రీలీలలో ఈ మార్పు ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

శ్రీలీల కెరీర్ మీద సీరియస్ గానే ఉంటున్నా ఆమెకు ఎదురవుతున్న ఫ్లాపుల వల్ల కాస్త వెనకడుగు వేయాల్సి వస్తుంది. పరాశక్తి హిట్ పడితే తమిళ్ లో గ్రాండ్ ఎంట్రీ దొరికినట్టే అవుతుంది. శివ కార్తికేయన్ తో పాటు ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ తో ఈ ఇయర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీలీల నెక్స్ట్ తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో కూడా సర్ ప్రైజ్ చేయబోతుంది అమ్మడు.

Tags:    

Similar News