అద్గదీ సంగతి మత్తెక్కించి మైమరిపించేలా!
ట్యాలెంటెడ్ బ్యూటీ శ్రీలీలకు ఇంత వరకూ సరైన రొమాంటిక్ సినిమా పడలేదు. చెప్పుకోవడానికి చాలా సినిమాలు చేసింది.;
ట్యాలెంటెడ్ బ్యూటీ శ్రీలీలకు ఇంత వరకూ సరైన రొమాంటిక్ సినిమా పడలేదు. చెప్పుకోవడానికి చాలా సినిమాలు చేసింది. కానీ పాత్రల పరంగా పరిమితంగానే తెరపై కనిపించింది. పాటకిచ్చిన ప్రాధాన్యత పాత్రకిచ్చి నట్లు కనిపించలేదు. దీంతో శ్రీలీల అంటే మంచి డాన్సర్ అనే ఐడెంటిటీ తప్ప కల్ట్ పెర్పా ర్మర్ అనే ఐడెంటిటీకీ మాత్రం ఇంకా దూరంగానే ఉంది. ఇప్పుడిప్పుడే కల్ట్ పాత్రల వైపు కొత్త టర్నింగ్ తీసుకుం టుంది. బాలీవుడ్ లో `ఆషీకీ 3` తో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రొమాంటిక్ కల్ట్ పాత్రలో ఎలా కనిపిస్తుందనే అంచనాలైతే? భారీగానే ఉన్నాయి.
బెడ్ రూమ్ సీన్స్ పీక్స్ లో
`ఆషీకీ` అంటే బాలీవుడ్ కల్ట్ లవ్ స్టోరీల్లో ఒకటి. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన రెండు చిత్రాలు భారీ విజయం సాధించినవే. ఇందులో హీరో-హీరోయిన్ పాత్రల మధ్య రొమాన్స్ ఎంతో అందంగా..అద్బుతంగా హైలై ట్ అవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు సన్నివేశాలు హృద్యంగా ఉంటాయి. రొమాన్స్ పీక్స్ లో హైలైట్ అవుతుంది. బెడ్ రూమ్ సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. `ఆషీకీ 3` లో అలాంటి సన్ని వేశాలకు ఆస్కారం ఉంది. ఇందులో శ్రీలీల కోస్టార్ గా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు.
వాటిలో కార్తీక్ ఘనాపాటే
అనురాగ్ బస్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. వాళ్లిద్దరి తో శ్రీలీల ఎలా మింగిల్ అవుతుందన్నది ఆసక్తికరం. ఇప్పటికే సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియాలో రొమాంటిక్ సన్నివేశాల విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కార్తీక్ ఆర్యన్-శ్రీలీల మద్య ఘాటైన మసాల సన్నివేశాలు లెక్కకు మించి ఉన్నా యన్నది మీడియా సారాంశం. రొమాంటిక్ సన్నివేశాల్లో సరికొత్త శ్రీలీలనే ఆవిష్కరిస్తుందనే కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఇలాంటి సన్నివేశాల విషయంలో కార్తీక్ కూడా ఆరితేరిన వాడే.
ఆ ఇద్దరి తర్వాత అనురాగ్
రొమాంటిక్ నటుడనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ బ్యూటీ టబుతో సైతం రొమాన్స్ ని పీక్స్ లో పండించిన నటుడిగా ఫేమస్ అయ్యాడు. అలాంటి నటుడితో శ్రీలీల రొమాన్స్ వెండి తెరను మరింత హీటెక్కించగలదు. అయితే ఆ రొమాన్స్ ను అనురాగ్ ఎంత అందంగా చూపిస్తాడు? అన్నది ఆసక్తికరం. మహేష్ బట్ సృష్టించిన `ఆషీకీ` ని మోహిత్ సూరి టేకింగ్ తో కొత్త అందాన్ని జోడించాడు. దీనికి కొనసాగిం పుతో అనురాగ్ ఇంకెలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.