శ్రీలీల 'అవతార్' కోసం ప్రయత్నాలు చేస్తోందా?
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హాలీవుడ్ ప్రయత్నాల్లో ఉందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హాలీవుడ్ ప్రయత్నాల్లో ఉందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `అవతార్` ఫ్రాంచైజీలో రాబోయే `అవతార్ 5` కోసం అమ్మడు ప్రయ త్నాలు మొదలు పెట్టిందని సమాచారం. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చిన్న పాత్ర దక్కించుకోవాలని శ్రీలీల ఉవ్విళ్లూ రుతోందిట. ప్రయత్నాల్లో భాగంగా శ్రీలీల తనకున్న పరిచయాలను, జేమ్స్ కామెరూన్ టీమ్‌తో సంబంధాలున్న సన్నిహిత వర్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతోందని విశ్వసనీయ సమాచారం.
ఇది సాహసోపేతమైన నిర్ణయమే అయినా? ప్రపంచస్థాయి వేదికపై మన నటీ మణులు సత్తా చాటాలనుకోవడం గర్వించదగ్గ విషయం. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా గ్లోబల్ ప్రాజెక్టుల వైపు శ్రీలీల అడుగులు వేయడం కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పొచ్చు. `అవతార్` వంటి భారీ విజువల్ వండర్ చిత్రాలలో? నటించడం అంటే అభినయం మాత్రమే కాదు. సాంకేతికతతో కూడిన కష్టమైన ప్రక్రియ. శ్రీలీలకు చురుకైన హావభావాలు, గ్రేస్.. అవతార్ ప్రపంచంలోని పాత్రలకు ఖచ్చితంగా సరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.
వివిధ గ్రహాలపై ఉండే అద్భుతమైన పాత్రల కోసం శ్రీలీల ఆహార్యం, శారీరక దృఢత్వం, బాడీ లాంగ్వేజ్ అదనపు ఆకర్షణ అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం అంటే ఎన్నో పరీక్షలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. హాలీవుడ్ ఆడిషన్ ప్రక్రియలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే శ్రీలీల అంకితభావం, కష్టపడే తత్వం చూస్తుంటే అవకాశం వస్తే అది కేవలం ఆమెకే కాకుండా తెలుగు పరిశ్రమకు దక్కే గొప్ప గౌరవంగా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయ నటులు పాశ్చాత్య చిత్రాల్లో మెరుస్తుండగా శ్రీలీల వంటి యువ నటి ఆ జాబితాలో చేరడం ఆసక్తికరంగా ఉంటుంది.
అంతర్జాతీయ స్థాయిలో అవకాశాల కోసం ప్రయత్నించడం అనేది నటి కెరీర్‌లో పరిణతికి సంకేతం. మన టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడాలంటే? ఇలాంటి ప్రయత్నాలు ఎంతో అవసరం. జేమ్స్ కామెరూన్ బృందం నుండి శ్రీలీలకు పిలుపు వస్తే? అది ఆమె అదృష్టమే కాదు. శ్రీలీల ప్రతిభకు దక్కే గుర్తింపు అవుతుంది. ఈ వార్త నిజమైతే కచ్చితంగా భారతీయ సినిమా చరిత్రలో గొప్ప మలుపుగా మిగిలిపోతుంది. ఇప్పటికే అవతార్ ప్రాంచైజీలో ఓ భారతీయుడు కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అతడి పేరు దిలీప్ రావు. సినిమాలో ఆయన డాక్టర్ మాక్స్ పటేల్ అనే కీలక పాత్ర పోషించారు. దిలీప్ రావు శాస్త్రవేత్తల బృందంలో ఒకరిగా ..ప్రధాన పాత్రలకు సహాయపడే వ్యక్తిగా నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయారు.