‘సింగిల్’ బాక్సాఫీస్: రెండో వారం కూడా అదే దూకుడు

శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోనూ దూసుకెళ్తోంది.;

Update: 2025-05-18 06:17 GMT
‘సింగిల్’ బాక్సాఫీస్: రెండో వారం కూడా అదే దూకుడు

శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోనూ దూసుకెళ్తోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం, రెండో వారంలో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసుకోవడం విశేషం. ఇక శనివారం బుక్ మై షోలోనే 32,460 టికెట్స్ అమ్ముడవ్వడం విశేషం. ఈ సినిమా ఇప్పటికే రూ. 25 కోట్ల గ్రాస్‌ను అందుకుని, ఆదివారం బ్లాక్‌బస్టర్ డే కోసం సిద్ధమవుతోంది.

‘సింగిల్’ సినిమా ఒక ఫన్ రైడ్ ఎంటర్‌టైనర్‌గా మొదటి వారం నుంచే ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమా కథలో ఒక యువకుడి జీవితంలో ఎదురైన సవాళ్లు, అతని ప్రేమ కథను కామెడీ, ఎమోషన్స్‌తో మిక్స్ చేసి చూపించారు. శ్రీ విష్ణు నటన, సినిమాలోని ఫన్ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు కూడా పెద్ద ఆకర్షించకపోవడంతో, ‘సింగిల్’ రెండో వారంలోనూ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తోంది.

రెండో వారంలో శనివారం బుక్ మై షోలో 32,460 టికెట్లు అమ్ముడవడం ‘సింగిల్’ సినిమా క్రేజ్‌ను చూపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల గ్రాస్ ను సాధించిందని, మరో రూ. 7 కోట్ల గ్రాస్‌ను ఇతర ఏరియాల నుంచి అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆదివారం మరింత ఎక్కువ టికెట్ సేల్స్‌తో మరో బ్లాక్‌బస్టర్ డే సాధించేలా కనిపిస్తోంది.

సినిమాలో శ్రీ విష్ణుతో పాటు కేతికా శర్మ, ఇవనా, వెన్నల కిషోర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. ఇక సినిమా కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయని, శ్రీ విష్ణు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు.

మొత్తంగా, ‘సింగిల్’ సినిమా రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ, శ్రీ విష్ణు కెరీర్‌లో మరో హిట్‌ను అందుకుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా ఫినిష్ అయ్యింది. అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్స్ సాధించినట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ అందుకుంటాయి అని మరోసారి రుజువైంది. ఇక సినిమా మిగతా రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Tags:    

Similar News