సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్.. ఈసారి మరింత ఫన్ గ్యారెంటీ
అలాంటి కాంబినేషన్ సెట్ అయినప్పుడు ఎప్పుడెప్పుడు ఆ కాంబోలో మరో సినిమా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.;
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొన్ని కాంబినేషన్లు అలా అనుకోకుండా కుదురుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ సెట్ అయినప్పుడు ఎప్పుడెప్పుడు ఆ కాంబోలో మరో సినిమా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.
శ్రీవిష్ణు కెరీర్లో సామజవరగమనకు సపరేట్ క్రేజ్
కెరీర్ స్టార్టింగ్ నుంచి భిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న శ్రీ విష్ణు కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్లలో సామజవరగమన కూడా ఒకటి. ఆ సినిమా సక్సెస్ శ్రీవిష్ణు కెరీర్లో ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది. కామెడీతో పాటూ సెంటిమెంట్, లవ్, ఎమోషన్ అన్నీ కలగలిపిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సామజవరగమన సినిమాకు మంచి క్రేజ్ ఉంది.
శర్వానంద్ తో నారీనారీ నడుమ మురారి
ఈ సినిమాతోనే రామ్ అబ్బరాజు అనే డైరెక్టర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే రామ్ అబ్బరాజు మంచి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన శర్వానంద్ హీరోగా నారీ నారీ నడుమ మురారి సినిమా చేస్తుండగా, ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి సామజవరగమన కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్టు అనౌన్స్‌మెంట్ వచ్చింది.
సామజవరగమన కాంబో రిపీట్
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా మరో సినిమా రానుందని, ఈసారి ఫన్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఫన్ రీలోడెడ్ అనే ఇమేజ్ తో మేకర్స్ ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా, దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు దసరా సందర్భంగా అనౌన్స్ కానున్నట్టు తెలిపారు. మరి ఈ సూపర్‌హిట్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.