స్పిరిట్ టీమ్ ఆ విషయాన్ని కావాలనే చెప్పడం లేదా?
ఇంకా చెప్పాలంటే ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని సినిమాల్లోకంటే ఈ ప్రాజెక్టుపైనే విపరీతమైన క్రేజ్ ఉంది.;
కొన్ని సినిమాలు మొదలవకముందే ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి సినిమానే స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ కు కూడా ఆ ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు ఏర్పడి, ఆ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందోనని ఇంట్రెస్ట్ కలిగింది.
పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన స్పిరిట్
ఇంకా చెప్పాలంటే ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని సినిమాల్లోకంటే ఈ ప్రాజెక్టుపైనే విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనుకున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ఎట్టకేలకు రీసెంట్ గానే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమాను లాంచ్ చేస్తూ మేకర్స్ ఈ మూవీలో ప్రభాస్ హీరోగా, త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుందని మరోసారి వెల్లడించారు.
కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్
హీరోహీరోయిన్లతో పాటూ ప్రముఖ నటి కాంచన, ప్రకాష్ రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించనున్నారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ లో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి స్పిరిట్ లో ఈ ఇద్దరే విలన్లుగా నటిస్తారని కొందరు ఊహిస్తుంటే అంతర్గత వర్గాలు మాత్రం స్పిరిట్ లో మెయిన్ విలన్ ఓ ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్తున్నాయి.
సౌత్ కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ ఈ సినిమాతో ఇండియన్ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటున్నారు. ఈ విషయంలో డాన్ లీ గతంలోనే ఇన్‌స్టా ద్వారా చిన్న చిన్న హింట్స్ ఇచ్చినప్పటికీ, స్పిరిట్ టీమ్ మాత్రం డాన్ లీ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. చూస్తుంటే డాన్ లీ విషయంలో మేకర్స్ సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేయాలని డిసైడ్ అయినట్టు అనిపిస్తోంది. మరి చూడాలి మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఎప్పుడిస్తారో.