దీపికా పదుకొణె.. ఇది అస్సలు కరెక్ట్ కాదు!

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్స్ లోకి వచ్చేందుకు ప్రభాస్ కూడా రెడీ అవుతున్నారు!;

Update: 2025-05-28 08:15 GMT

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ వర్క్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్స్ లోకి వచ్చేందుకు ప్రభాస్ కూడా రెడీ అవుతున్నారు!

అదే సమయంలో రీసెంట్ గా సందీప్ వంగా హీరోయిన్ పేరు అనౌన్స్ చేశారు. స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను ఫిమేల్ లీడ్ నుంచి తప్పించారు. యానిమల్ మూవీతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. దీంతో దీపికాను ఎందుకు తప్పించారోనని సోషల్ మీడియాలో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

అప్పుడే కరెక్ట్ గా సందీప్ నెట్టింట పోస్ట్ పెట్టారు. స్టార్ హీరోయిన్ కు చెందిన పీఆర్‌ టీమ్‌ తన స్టోరీని లీక్‌ చేసే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన ఆరోపించారు. డర్టీ పీఆర్‌ గేమ్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ లో పోస్ట్ పెట్టి మండిపడ్డారు. దర్శకుడిగా తాను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతానని, సినిమానే ప్రపంచమని చెప్పారు.

"ఇటీవల నేను ఓ స్టార్ హీరోయిన్ కు స్టోరీ చెప్పాను. 100% నమ్మకంతో వివరించాను. అప్పుడు అనధికారిక నాన్ డిస్‌ క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉన్నట్లే లెక్క. అందుకే స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యంగ్ హీరోయిన్ ఎదగకుండా చేయడం.. ఎంతో కష్టపడి రాసుకున్న నా కథను లీక్‌ చేయడం.. ఇదేనా ఫెమినిజం అంటే?" అంటూ ఫైర్ అయ్యారు.

దీంతో దీపికను ఉద్దేశించే సందీప్ రెడ్డి వంగా పోస్ట్ పెట్టారని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే దీపికను తప్పించాక బాలీవుడ్ లో మూవీపై తప్పుడు ప్రచారం జరిగింది. అందుకే ఆమె కోసమని ఫిక్సయ్యారు. అయితే దీపికను తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రోజుకు ఆరు గంటలే వర్క్ చేస్తానని దీపిక చెప్పిందట. ఆ తర్వాత 100 రోజులకు మించి షూటింగ్ జరిగితే ఎక్స్ ట్రా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అలా అనేక కండీషన్లు పెట్టారట అమ్మడు. ఆ తర్వాత వాటన్నింటి ఫలితంగా సృజనాత్మక విభేదాలు తలెత్తడంతో వంగా ఆ నిర్ణయం తీసుకున్నారని వినికిడి.

అదే సమయంలో కొన్ని నెలల క్రితం మదర్ ఫీల్డ్ లోకి వచ్చింది దీపిక. కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్టర్ తో డిస్కస్ చేయాలి. కానీ సంబంధం లేదని కండీషన్స్ ను పెట్టడం కరెక్ట్ కాదని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సినిమా నుంచి తనను తప్పించినా.. స్టోరీ లీక్ చేయడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు దీపిక మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News