థియేటర్లో సినిమా చూడటం మానేసిన నటుడు!
స్టార్ హీరోలు అభిమానుల మధ్యలో కూర్చుని సినిమా చూడటం అంటే సాధ్యం కాదు.;
స్టార్ హీరోలు అభిమానుల మధ్యలో కూర్చుని సినిమా చూడటం అంటే సాధ్యం కాదు. అందుకే మహేష్ స్టార్ అయిన తర్వాత హైదరాబాద్ లో సినిమా చూడటం మానేసి ముంబైలో చూడటం మొదలు పెట్టారు. కొన్నాళ్లకు అక్కడా ఫేమస్ అవ్వడంతో? అభిమనులొచ్చి మీద పడుతున్నారని అక్కడకు వెళ్లడం మానేసారు. అప్పటి నుంచి రిలీజ్ రోజు ఇంట్లో ఉండటం లేదంటే? అమెరికాలో షో వీక్షించడం...ఆ రెండు కుదరని పక్షంలో ఫ్యామిలతో వెకేషన్ కు వెళ్లిపోవడం జరుగుతుంది. ప్రభాస్ కూడా తన సినిమా విదేశాల్లోనే చూస్తుంటాడు.
ఇబ్బందులు పడ్డ బన్నీ:
బన్నీ మాత్రం చాలా కాలం తర్వాత `పుష్ప2` వీక్షించడం కోసం థియేటర్ కు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా విదేశాలల్లోనే చూస్తారు. కానీ వీరిద్దరకు మాత్రం ఈ విషయంలో అడ్వెంచర్ చేయడం అంటే ఇష్టం. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి కర్చీపులు కట్టేసుకుని, నెత్తికి టోపీ ధరించి థియేటర్లో చూసి రావొచ్చు? అనే ఆలోచనలు కలుగుతుంటాయి. కానీ పోర పాటున గుర్తు పడితే సన్నివేశం ఎలా ఉంటుందో కూడా తెలుసు.
వాళ్లిద్దరు ఎంచక్కా చూసొచ్చారు:
రాంగోపాల్ వర్మ, సాయి పల్లవి కూడా ఓ సందర్భంలో థియేటర్లో సినిమా చూడటం కోసం సాయిపల్లవి అయితే స్కార్ప్ ధరించి చూసొచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత హడావుడిగా వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అలాగే వర్మ కూడా పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఓ సినిమాను ముఖానికి కర్చీపు..నెత్తికి టోపీ పెట్టి వెళ్లి చూసొచ్చాడు. తాజాగా కన్నడ స్టార్ ఉపేంద్ర విషయంలో మాత్రం తొలి సినిమాకే చాలా ఇబ్బందులు పడినట్లు గుర్తు చేసుకున్నాడు. అతడు హీరోగా నటించిన `ఏ` తొలి సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆడియన్స్ తో కలిసి చూడాలని థియేటర్ కు వెళ్లాడు.
ప్రేక్షకులు ఇబ్బంది పడకూడదని:
కొత్త వారు కాబట్టి ఎలాగూ గుర్తు పట్టరని థియేటర్లోకి వెళ్లి కూర్చున్నాడు. కానీ థియేటర్ అప్పటికే యువతతో నిండిపోయింది. వాళ్లు ఉపేంద్రను గుర్తించి బయటకు వెళ్తుంటే? ఆయన వెంట వచ్చేసారట. ఆ తర్వాత పోలీసుల బందోబస్త్ నడుమ ఎలాగూ కారు ఎక్కగలిగానని తెలిపారు. అప్పటి నుంచి తాను థియేటర్లో సినిమా చూడటం మానేసినట్లు తెలిపారు. తన కారణంగా అభిమానులు ఇబ్బంది పడకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేళ్తే తనని చూసే క్రమంలో ప్రేక్షకులు థియేటర్లో ఉన్న సినిమాను చూడరేమో అన్న బాధ తనకి ఉంటుందన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం రజనీకాంత్, చిరంజీవి , రాజ్ కుమార్ లాంటి నటుల సినిమాలు ఫస్ట్ షో చూసేవాడినన్నారు.