స్పీడున్నోడు హీరోయిన్ బేబి బంప్ ఫోజులు

వివాహం తర్వాత సోనారికా న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చింది. ఇటీవ‌ల‌ టీవీ ప్రాజెక్టులకు దూరంగా ఉంది. సోనారికా బ‌ధోరియా 2011లో `తుమ్ దేనా సాత్ మేరా` అనే షోతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.;

Update: 2025-09-14 22:30 GMT

హిందీ సీరియ‌ళ్ల‌తో ఓ వెలుగు వెలిగిన న‌టి సోనారికా బ‌దోరియా. `జాదూగాడు` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌యమైంది. స్పీడున్నోడు చిత్రంలో బెల్లంకొండ శ్రీను స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత ఈడోర‌కం ఆడోర‌కం సినిమాలోను త‌న అంద‌చందాల‌తో ఆక‌ర్షించింది. అటు హిందీ సినిమాలు, సీరియ‌ళ్ల‌తోను సోనారికా బ‌దోరియా కెరీర్ జ‌ర్నీ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇటీవ‌ల వెబ్ సిరీస్ లలోను న‌టిస్తోంది.

 

`దేవోన్ కే దేవ్ మహాదేవ్` అనే హిందీ సిరీస్‌లో పార్వతిగా పేరు తెచ్చుకున్న సోనారికా భడోరియా ఫిబ్రవరి 2024లో వ్యాపారవేత్త వికాస్ పరాశర్ ని వివాహం చేసుకుంది. ఈ జంట ఇప్పుడు త‌ల్లిదండ్రులు అవుతున్నారు.

 

వికాస్ - సోనారికా పెళ్లికి ముందు చాలా కాలంగా సంబంధంలో ఉన్నారు. ఈ జంట వారి సన్నిహిత కుటుంబం, స్నేహితుల స‌మ‌క్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.

 

వివాహం తర్వాత సోనారికా న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చింది. ఇటీవ‌ల‌ టీవీ ప్రాజెక్టులకు దూరంగా ఉంది. సోనారికా బ‌ధోరియా 2011లో `తుమ్ దేనా సాత్ మేరా` అనే షోతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. కానీ దేవోన్ కే దేవ్... మహాదేవ్ అనే షోలో దేవ‌త‌ పార్వతి పాత్రలో అద్భుత న‌ట‌న‌తో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. పార్వ‌తీదేవి అంటే ప్ర‌జ‌లు సోనారిక‌నే చూపించేంతగా ఫేమ‌స్ అయింది. సినీరంగంలో కొన‌సాగుతూనే బుల్లితెర‌పైనా రాణించింది బ‌దోరిక‌. పృథ్వీ వల్లభ్, దస్తాన్-ఎ-మొహబ్బత్ సలీం అనార్కలి, ఇష్క్ మే మార్జావాన్ లాంటి సీరియ‌ళ్ల‌తో టీవీ రంగంలో పాపుల‌రైంది.

Tags:    

Similar News