ఐదారు ఎక‌రాలు రాసిస్తే.. న‌టి ఛ‌మ‌త్కారం

అయితే ఒక ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లో బాలీవుడ్ నటి సోన‌మ్ బ‌జ్వా స‌ర‌దా ప‌రాచికం ఇప్పుడు ఆన్ లైన్ లో చ‌ర్చ‌గా మారింది.;

Update: 2025-07-12 04:00 GMT

ఇది అడ‌ల్ట్ జోక్ కాదు! అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రం గురించిన హింట్. ముంబై నుంచి దాదాపు 1000 కి.మీ.ల దూరంలో ఉండే మ‌రో అభివృద్ధి చెందిన న‌గ‌రం గుర్ గావ్ (గురుగ్రామ్)లో రియ‌ల్ ఎస్టేట్ జోరు గురించిన క్లూ ఇది. హ‌ర్యానా(పంజాబ్) - దిల్లీ హైవే లో అత్యంత సుంద‌రంగా కొలువు దీని ఉన్న‌ ఈ న‌గ‌రంలో దాదాపు 9ల‌క్ష‌ల మంది నివసిస్తున్నారు. త‌క్కువ ప‌రిధిలోనే ఇక్క‌డ జ‌న‌సాంద్రత అధికంగా పెర‌గ‌డంతో రియ‌ల్ ఎస్టేట్ కూడా జోరు మీద ఉంది. చాలా మంది సినీ సెల‌బ్రిటీలు త‌మ సంపాద‌న‌ను ఇక్క‌డ కూడా పెట్టుబ‌డిగా పెడుతున్నారు. గుర్ గావ్ లో ఖ‌రీదైన స్థ‌లాలు, అపార్ట్ మెంట్ల‌ను టాప్ హీరోలు, హీరోయిన్లు కూడా కొనుగోలు చేస్తుంటారు.

అయితే ఒక ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లో బాలీవుడ్ నటి సోన‌మ్ బ‌జ్వా స‌ర‌దా ప‌రాచికం ఇప్పుడు ఆన్ లైన్ లో చ‌ర్చ‌గా మారింది. తన‌కు ఎవరైనా 5-6 ఎకరాల స్థలాన్ని బహుమతిగా ఇస్తే తాను ఖచ్చితంగా గుర్గావ్‌కు వెళ్తానని చమత్కరించారు! ఆమె సరదాగా చేసిన ఈ వ్యాఖ్య అభిమానుల్లో వేగంగా క‌నెక్ట‌యింది. సోషల్ మీడియాలో స్మైల్ ఈమోజీల‌తో ప‌లువురు స్పందించారు.

సోన‌మ్ బ‌జ్వా ఇటీవ‌లే `హౌస్ ఫుల్ 5` లాంటి హిట్ చిత్రంలో న‌టించింది. ఈ సినిమా నార్త్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన కామెడీ ఫ్రాంఛైజీ చిత్రంగా రికార్డుల‌కెక్కింద‌నేది టాక్. గోల్ మాల్, ధ‌మాల్ లాంటి ఫ్రాంఛైజీల‌ను మించిన వ‌సూళ్ల‌ను సాధించింద‌ని స‌మాచారం. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, న‌ర్గీస్ ఫ‌క్రీ, సౌంద‌ర్య శ‌ర్మ లాంటి హా*స్ట్ గాళ్స్ మ‌ధ్య‌లో కూడా సోన‌మ్ బ‌జ్వా న‌ట‌న‌, కామిక్ టైమింగ్ ఆక‌ర్షించాయ‌ని ప్ర‌శంస‌లు కురిసాయి.

త‌దుప‌రి సోన‌మ్ బ‌జ్వా `ఏక్ దీవానే కి దీవానియాత్`లో హర్షవర్ధన్ రాణేతో కలిసి కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ `బాఘి 4`లోను సోన‌మ్ బ‌జ్వా న‌టిస్తోంది.

Tags:    

Similar News