చీకట్లో.. చైతూ సతీమణి!
శోభితా ధూళిపాల తన నటనతో ఇప్పటికే తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా 'మేడ్ ఇన్ హెవెన్' లాంటి సిరీస్‌లతో ఆమె గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందింది.;
ఏ ఇండస్ట్రీలో అయినా ఒక పెద్ద స్టార్ కుటుంబంతో సంబంధం ఉన్న వారిపై ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అదే కోవలోకి వస్తోంది శోభితా ధూళిపాల కొత్త వెబ్ మూవీ. ఆమె కెరీర్‌ను సురేష్ ప్రొడక్షన్స్ వంటి అగ్ర సంస్థ నిర్మిస్తుండటం, దానికి సంబంధించిన టైటిల్ కూడా చాలా మిస్టీరియస్‌గా ఉండటంతో ఒక కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆ టైటిల్ వెనుక ఉన్న కథేంటి అనే వివరాల్లోకి వెళితే..
శోభితా ధూళిపాల తన నటనతో ఇప్పటికే తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా 'మేడ్ ఇన్ హెవెన్' లాంటి సిరీస్‌లతో ఆమె గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందింది. ఇలాంటి సమయంలో, ఆమె సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఒక వెబ్ మూవీ కమిట్ అవ్వడం సో స్పెషల్. సురేష్ బాబు మామ నుంచి ఎలాంటి సపోర్ట్ అందుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు శోభిత కోసం ఓ ప్రాజెక్టును సెట్ చేయడం విశేషం.
ఈ వెబ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నది శరణ్ కొప్పిశెట్టి. ఈ దర్శకుడు గతంలో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'తిమ్మరుసు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న దర్శకుడు, శోభితా ధూళిపాలకు ఎలాంటి కథను సిద్ధం చేశాడనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ వెబ్ మూవీకి సంబంధించి టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.
ఆ టైటిల్ 'చీకట్లో'. టైటిల్‌లో ఉన్న మిస్టరీ థ్రిల్ చూస్తుంటే, శోభితా ధూళిపాల ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుతో పాటు, ఈ సినిమాను ఏకంగా దాదాపు 18 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్‌గా విడుదల చేయనున్నారు.
ఒకేసారి ఓటీటీలో ఒక సినిమాను 18 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడం అనేది ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నారు. ఇది సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా భావించవచ్చు. ఇన్ని భాషల్లో డబ్ చేయడం ద్వారా, ఈ సినిమాను గ్లోబల్ ప్రేక్షకులకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
శోభితా ధూళిపాల, సురేష్ ప్రొడక్షన్స్, దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న ఈ 'చీకట్లో' వెబ్ మూవీపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా నవంబరు నెలలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వెబ్ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఎంతవరకు ఆకర్షిస్తుంది, ముఖ్యంగా గ్లోబల్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.