అక్కినేని కోడ‌లు హంగామా ఆ రేంజులో

అక్కినేని వారి పెద్ద కోడ‌లు శోభిత ధూళిపాల స్పెషాలిటీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా? పెద్దింటి కోడ‌లు కాక ముందే గొప్ప ఫ్యాష‌నిస్టా.;

Update: 2025-06-16 09:30 GMT

అక్కినేని వారి పెద్ద కోడ‌లు శోభిత ధూళిపాల స్పెషాలిటీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా? పెద్దింటి కోడ‌లు కాక ముందే గొప్ప ఫ్యాష‌నిస్టా. క్యాట్ వాక్ ల‌తో ర్యాంప్ ని అల్లాడించిన మేటి ప్ర‌తిభావ‌ని. సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించాక ఇక్క‌డా నిరూపించుకుంది. న‌టిగాను వంద‌కు వంద శాతం మార్కుల‌తో ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండు చోట్లా శోభిత ప్ర‌తిభ‌కు అవ‌కాశాలే అవ‌కాశాలు. అయితే అక్కినేని కోడ‌లు హోదాలో సెల‌క్టివ్ గా ముందుకు సాగుతోంది. ఇప్పుడు అక్కినేని లెగ‌సీని ముందుకు న‌డిపించే వార‌సుడిని కూడా అందించాల్సి ఉంది.


ఇలాంటి స‌మ‌యంలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి వేడుక‌లో శోభిత గురించే చ‌ర్చ‌. ఈ పెళ్లిలో పెద్ద కోడ‌లు శోభిత హంగామా అంతా ఇంతా కాదు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల‌ను చూడ‌టం నుంచి, అన్నిటా తానే అయ్యి వ్య‌వ‌హ‌రించింది. అందుకేనేమో ప్ర‌తి ఫ్రేమ్ లో శోభిత‌నే క‌నిపించింది. అందంలో ట్రెడిష‌న్ ని ఫాలో అవ్వ‌డంలో శోభిత ప్ర‌త్యేక‌త అహూతుల్ని ఆక‌ర్షించింది.


ఇంత‌కుముందే పెళ్లి వేడుక నుంచి చాలా ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మ‌రిన్ని కొత్త ఫోటోలు ఇంట‌ర్నెట్ లో కి వ‌చ్చాయి. వీటిలో శోభిత వైవిధ్య‌మైన లుక్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. ఓచోట మెరూన్ క‌ల‌ర్ లెహంగాలో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తే మ‌రోచోట బ్లాక్ కోట్ లో పోష్ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌తి ఫోటోగ్రాఫ్‌లో కొత్త‌గా క‌నిపించ‌డం ఎలానో శోభిత‌కే తెలుసు అనేలా ఈ ఫోటోషూట్ ఆక‌ట్టుకుంది. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. శోభిత నెక్ట్స్ ఏంటి? అనేది వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News