సీనియర్ నటిని దేవతగా ఆరాధిస్తున్నారు..!
1927 విరుధునగర్ జిల్లాలోని అరుప్పుకోట్టై సమీపంలో ఉండే మారుమూల గ్రామంలో జన్మించిన ఎస్‌ఎన్ లక్ష్మి చిన్న వయసులోనే నాటకాల్లో ఎంట్రీ ఇచ్చింది.;
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారు ఇప్పుడు భారీగా సంపాదిస్తున్నారు. అయిదు పది సినిమాల్లో నటించిన వారు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఏకంగా 1500లకు పైగా సినిమాల్లో నటించి, 6000 నాటకాల్లో నటించిన సీనియర్ నటి ఎస్‌ఎన్ లక్ష్మి ఏ స్థాయిలో సంపాదించి ఉంటారో ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో అయినా భారీగానే లక్ష్మి గారు సంపాదించారు. అయితే ఆమె తన గ్రామస్తులకు, తన కుటుంబ సభ్యులకు ఆస్తి మొత్తం ఇచ్చి ఒంటరిగానే జీవితాన్ని చాలించారు. సినిమాలకు, నాటకాలకు జీవితాన్ని అంకితం చేయడం ద్వారా తనకంటూ సొంత ఫ్యామిలీని ఆమె ఏర్పాటు చేసుకోలేదు. అందుకే ఆమె తన ఆస్తి మొత్తంను బంధువులకు, తన సొంత గ్రామస్తులకు ఇవ్వడం జరిగిందని స్థానికులు ఆమె గురించి అడిగిన సమయంలో చెబుతూ ఉంటారు.
కోలీవుడ్ సీనియర్ నటి ఎస్‌ఎన్ లక్ష్మి
1927 విరుధునగర్ జిల్లాలోని అరుప్పుకోట్టై సమీపంలో ఉండే మారుమూల గ్రామంలో జన్మించిన ఎస్‌ఎన్ లక్ష్మి చిన్న వయసులోనే నాటకాల్లో ఎంట్రీ ఇచ్చింది. తన చిన్నప్పుడే నాన్న ఉద్యోగం పోవడంతో పాటు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. తన తల్లిదండ్రులకు మొత్తం 13 మంది సంతానంలో చిన్నది కావడంతో ఎస్‌ఎన్ లక్ష్మి పై ప్రతి ఒక్కరిలోనూ అప్పట్లో చిన్నచూపు ఉండేదట. కానీ అలా తనను చిన్నచూపు చూసిన వారితోనే జేజేలు చెప్పించుకున్న ఘనత నటి లక్ష్మి గారికి దక్కుతుందని ఆమె సన్నిహితులు, ఆమె బంధువులు అంటూ ఉంటారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా నాటక రంగంలో అడుగు పెట్టిన ఎస్‌ఎన్ లక్ష్మి ఆ తర్వాత అదే తన జీవితంగా మల్చుకుంది. చిన్న వయసులో నాటకాల్లో అడుగు పెట్టిన ఆమె 20 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
చంద్రలేఖ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ
1948లో చంద్రలేఖ అనే సినిమాలో డాన్సర్‌గా చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మూడు పదుల వయసులోనే అమ్మమ్మ పాత్రలు చేయడం ద్వారా ఈమె గురించి అందరిలోనూ చర్చ జరిగేది. కోలీవుడ్‌లో దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లోనూ ఈమె నటించడం జరిగింది. అంతే కాకుండా తన పాత్రలతో ఎంతో మంది ఇళ్లలోకి వెళ్లింది. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే తరహా పాత్రలను చేయడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగా తనకంటూ ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న ఈమె గురించి ఇప్పటికీ మాట్లాడుకునే కొన్ని సినిమాలను, పాత్రలను పోషించడం జరిగింది. ఆ పాత్రలు, సినిమాలు ఆమెను ఇప్పటికీ తమిళ ప్రేక్షకులకు గుర్తు వచ్చేలా చేస్తాయి అనడంలో సందేహం లేదు.
శివరాత్రి సందర్భంగా ఉత్సవం
ఇండస్ట్రీలో పాపులారిటీ సొంతం చేసుకోవడంతో పాటు, పెళ్లి చేసుకోకుండా తన మొత్తం జీవితంను కళకు అర్పితం చేసిన ఎస్‌ఎన్ లక్ష్మి ని ఆమె సొంత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దేవతగా పూజిస్తారు. ప్రతి ఏడాది ఒక రోజున ఆమె పేరు మీద పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. నటిగా వందల కొద్ది సినిమాలు చేసిన వారికి కూడా గుర్తింపు దక్కని సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. అప్పట్లో మినిమం మీడియా లేని సమయంలో సినిమాల్లో నటించిన ఎస్‌ఎన్ లక్ష్మి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే ఆమె యొక్క గొప్పతనం అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా ప్రతి ఏడాది ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించే ఉత్సవం కారణంగా కూడా ఆమెను ప్రతి ఏడాది గుర్తు చేసుకోవడం జరుగుతుంది. 2012 సంవత్సరంలో మరణించిన ఎస్‌ఎన్ లక్ష్మి జ్ఞాపకార్థం గ్రామంలో స్మారక చిహ్నంను నిర్మించారు. అక్కడ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.