తెలుగు పాప్ స్టార్ స్మిత ఏమ‌య్యారు?

పాప్ క‌ల్చ‌ర్ అనేది పాశ్చాత్య దేశాల వ‌ర‌కే ప‌రిమితం అనుకునే రోజుల్లో తెలుగ‌మ్మాయి, గాయ‌ని స్మిత పాప్ కేవ‌లం వెస్ట్ర‌న్ స్టైల్ కాదు, భార‌త‌దేశంలోని ప‌ల్లె ప‌ల్లెనా మార్మోగే ఇండో వెస్ట్ర‌న్ స్టైల్ పాట అని నిరూపించారు.;

Update: 2025-12-14 05:10 GMT

పాప్ క‌ల్చ‌ర్ అనేది పాశ్చాత్య దేశాల వ‌ర‌కే ప‌రిమితం అనుకునే రోజుల్లో తెలుగ‌మ్మాయి, గాయ‌ని స్మిత పాప్ కేవ‌లం వెస్ట్ర‌న్ స్టైల్ కాదు, భార‌త‌దేశంలోని ప‌ల్లె ప‌ల్లెనా మార్మోగే ఇండో వెస్ట్ర‌న్ స్టైల్ పాట అని నిరూపించారు. అప్ప‌ట్లో స్మిత రీమిక్స్ సాంగ్ `మ‌స‌క మ‌స‌క చీక‌టిలో` ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ పాట‌ను స్మిత రిలీజ్ చేసారు. అది అప్ప‌ట్లో చార్ట్ బ‌స్ట‌ర్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచింది.

ఇటీవ‌ల స్త‌బ్ధుగా క‌నిపించిన స్మిత తిరిగి రీబూట్ అవుతోంది. ఇప్పుడు ఆ సూప‌ర్ హిట్ సాంగ్ కి అప్‌డేటెడ్ వెర్ష‌న్ ని తీసుకు వ‌స్తున్నాం అంటూ పాప్ గాయ‌ని స్మిత మ‌రోసారి అభిమానుల‌కు సూప‌ర్ గుడ్ న్యూస్ చెప్పారు. మ‌స‌క మ‌స‌క‌.. కొత్త వెర్ష‌న్ ని బిగ్ బాస్ వేదిక‌గా స్మిత లాంచ్ చేసారు. ఈ పాట‌కు విజ‌య్ బిన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, నోయ‌ల్- స్మిత డ్యాన్స్ చేసారు. ఇక‌పై మ్యూజిక్ ఆల్బ‌మ్స్ తో మ‌ళ్లీ అభిమానుల ముందుకు వ‌స్తున్నాన‌ని స్మిత ప్ర‌క‌టించారు.

అయితే గాయ‌నిగా మాత్ర‌మే కొన‌సాగుతాను అని చెప్పారు కానీ, న‌టిగా ఎందుకు కొన‌సాగ‌డం లేదు? ఈ ప్ర‌శ్న‌కు కూడా స్మిత స‌మాధానం ఇచ్చారు. చాలా కాలం క్రితం `మ‌ల్లీశ్వ‌రి` సినిమాలో న‌టించిన స్మిత‌, ఆ త‌ర్వాత నాగార్జున కింగ్ లోను ఓ పాత్ర‌లో క‌నిపించింది. కానీ ఎందుక‌నో న‌టిగా త‌న కెరీర్ ని మాత్రం కొన‌సాగించ‌లేదు. దీనికి కార‌ణం ``ద‌ర్శ‌కులు మ‌న‌కు చెప్పేది ఒక‌టి.. అక్క‌డ చేయించేది ఇంకొక‌టి.. అందుకే న‌టించ‌డం లేద‌``ని స్మిత అన్నారు. మ‌ల్లీశ్వ‌రి సినిమాలో త‌న పాత్ర మిస్ ఫైర్ అయింద‌ని కూడా అంగీక‌రించారు. ఆ త‌ర్వాత న‌టించ‌కూడ‌దు అనుకున్నాన‌ని వెల్లడించారు.

స్మిత వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే, త‌న‌కు ఒక కుమార్తె ఉన్నారు. ప్ర‌స్తుతం తిరిగి గాయ‌నిగా బిజీ అవ్వాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇక‌పై వ‌రుస‌గా ఆల్బ‌మ్స్ లో న‌టిస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటాన‌ని కూడా తెలిపారు. స్మిత కొత్త ఇన్నింగ్స్ లో ఏమేర‌కు రాణిస్తారో వేచి చూడాలి. ఇక స్మిత కొంత గ్యాప్ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. ఇప్పుడు మునుప‌టి కంటే మ‌రింత స్లిమ్ గా క‌నిపిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. సినిమాల‌తో పాటు బిజినెస్ విమెన్ గాను స్మిత తెలుగు స‌ర్కిల్స్ లో పాపుల‌ర‌య్యారు.


Full View


Tags:    

Similar News