శివ కార్తికేయన్‌ రూటే సపరేటు..!

'అమరన్‌' సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో శివ కార్తికేయన్‌.;

Update: 2025-08-05 08:20 GMT

'అమరన్‌' సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో శివ కార్తికేయన్‌. వీడియో జాకీ, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ నుంచి కోలీవుడ్‌ స్టార్‌ హీరో స్థాయికి చేరుకున్న శివ కార్తికేయన్‌ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా పేరు దక్కించుకున్నాడు. రజనీకాంత్‌ హీరోగా నటించిన కూలీ సినిమాలో శివ కార్తికేయన్‌ చిన్న పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర ఏంటి, ఆ విశేషాలు ఏంటి అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరో వైపు శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందుతున్న మదరాశి, పరాశక్తి సినిమాలు ప్రేక్షకుల్లో ముఖ్యంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు సినిమాలు విభిన్నమైన జోనర్‌లో రూపొందడంతో రెండు సినిమాలకు అదే స్థాయిలో క్రేజ్ ఉంది.

సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి

పరాశక్తి సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చిందని, ఆ సినిమాతో శివ కార్తికేయన్‌ నట విశ్వరూపం చూడబోతున్నారు అంటూ కోలీవుడ్‌ వర్గాల వారు ముఖ్యంగా చిత్ర యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు. ఆకట్టుకునే స్క్రిప్ట్‌తో పాటు, శివ కార్తికేయన్‌ నుంచి ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో దాన్నే ఈ సినిమాలో దర్శకురాలు సుధా కొంగర చూపించబోతున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెల్సిందే. తాజాగా శివ కార్తికేయన్‌ ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్న సీక్వెల్స్‌, ప్రాంచైజీ సినిమాల పట్ల శివ కార్తికేయన్‌ తన నిర్ణయాన్ని క్లీయర్‌ కట్‌గా చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు.

సీక్వెల్స్‌ పై శివ కార్తికేయన్‌ క్లారిటీ

శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ... తాను సీక్వెల్స్‌కి వ్యతిరేకం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఏ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచన లేదు. సీక్వెల్‌ ను చేసి విఫలం అయితే ఒరిజినల్‌ సినిమా స్థాయి తగ్గుతుంది. అప్పటి వరకు ఒరిజినల్‌ సినిమాలకు ఉన్న ఖ్యాతి తగ్గుతుంది. అందుకే ఒరిజినల్‌ సినిమాల స్థాయిని తగ్గించడం, వాటి గౌరవంను దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడూ సీక్వెల్‌ చేసే యోచన చేయడం లేదని శివ కార్తికేయన్‌ చెప్పుకొచ్చాడు. ఒరిజినల్‌ కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని చేయడం మంచిదని, గొప్ప సినిమాలను రీమేక్‌ చేయడం, సీక్వెల్‌ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్‌ అని, ఆ రిస్క్‌ను తాను ఎదుర్కోలేను అని శివ కార్తికేయన్‌ అన్నాడు.

మావీరన్‌ సీక్వెల్‌ పై ఆసక్తి

ఒకవేళ సీక్వెల్‌ అనేది ఖచ్చితంగా చేయాల్సి వేస్తే అప్పుడు మావీరన్‌ 2 చేస్తాను అన్నాడు. ఆ సినిమా తన హృదయంలో ప్రత్యేకమైన స్థానంను కలిగి ఉందని చెప్పుకొచ్చాడు. అయితే గొప్ప స్క్రిప్ట్‌ వస్తేనే ఆ సీక్వెల్‌ను చేసేందుకు ఒప్పుకుంటాను అన్నాడు. ఎప్పుడైతే ఒరిజినల్‌ సినిమా ప్రతిష్ట దెబ్బ తినదు అనిపిస్తుందో అప్పుడే నేను ఏదైనా సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ను లేదా ప్రాంచైజీలో నటించేందుకు ఒప్పుకుంటాను అన్నాడు. అయితే ఇప్పటి వరకు నా వద్దకు అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఏమీ రాలేదు అన్నట్లుగా శివ కార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఎంతో మంది హీరోలు హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే పబ్లిసిటీ దక్కి మంచి విజయం సొంతం అవుతుందని అనుకుంటూ ఉంటే, శివ కార్తికేయన్‌ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో చాలా మంది ఆయన రూటే సపరేటు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News