ఇండస్ట్రీకి లెజెండరీ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు
కోలీవుడ్ లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ కుటుంబం నుండి మరో వారసుడిగా తారధర్శన్ గణేషన్ నీహీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. తారధర్మన్ డెబ్యూ సినిమా `లెనిన్ పాండియన్` తాజాగా షూటింగ్‌పూర్తి చేసుకుంది.
కోలీవుడ్ లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ కుటుంబం నుండి మరో వారసుడిగా తారధర్శన్ గణేషన్ నీహీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. తారధర్మన్ డెబ్యూ సినిమా `లెనిన్ పాండియన్` తాజాగా షూటింగ్‌పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కుటుంబ లెగసీ గురించి తారా దర్శన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబం తెచ్చిపెట్టే భారీ వారసత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది అనవసరమైన భయానికి, ఒత్తిడికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.
లెజెండరీ నటుడి మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా? ఆ పెద్ద పేరును మోస్తున్నాననే భయంతో సతమతం కాకుండా తన పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలని తారధర్శన్ భావిస్తున్నారు. ఈ మహా కుటుంబంలో జన్మించినందుకు తానెప్పుడూ గర్వపడుతుంటానని, ప్రతి క్షణం తన వంతు వంద శాతం కష్టపడి నిజాయితీగా పని చేయడమే ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. ఇతరుల అంచనాలను అందుకోవడం కంటే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే తాతగారికి ఇచ్చే నిజమైన నివాళి అని బలంగా విశ్వసిస్తున్నారు.
తొలి సినిమా కోసం తారధర్శన్ ఎంచుకున్న మార్గం కూడా ఎంతో వైవిధ్యంగా ఉండటం విశేషం. సాధారణంగా స్టార్ కిడ్స్ రొమాంటిక్ లేదా కమనర్శియల్ సిటీ బ్యాక్‌డ్రాప్ కథలతో లాంచ్ అవ్వాలని చూస్తుంటారు. కానీ తారదర్శన్ మాత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో వస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఓ విలేజ్ పోలీస్ కాన్స్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం తారా దర్శన్ స్వయంగా పోలీస్ స్టేషన్లలో గంటల తరబడి కూర్చుని స్థానిక ప్రజల జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశోధించి మరీ నటించడం ఆయన అంకితభావాన్ని చాటుతోంది.
తన నటనకు పునాది వేసిన థియేటర్ ఆర్ట్స్ .. స్ట్రీట్ డ్రామా అనుభవాలు తనను పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దాయని తారధర్శన్ తెలిపారు. తాత శివాజీ గణేషన్ కూడా కెరీర్ ప్రారంభంలో వీధి నాటకాల ద్వారానే పైకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తాను కూడా అదే దారిలో నడవడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. మంచి నటుడికి కేవలం నటనానుభవం మాత్రమే కాకుండా పాటలు , నృత్యాలపై కూడా అవగాహన ఉండాలని అలాంటి సమగ్ర శిక్షణ తాను పొందానని వెల్లడించారు.
సినిమా రంగంలో నెపోటిజం .. వారసత్వపు అంశాలపై ఎప్పుడూ వాదనలు జరుగుతుంటాయి. అయితే తన కుటుంబం ఎవరికీ ఫోన్లు చేసి సిఫార్సులు చేయలేదని తన సొంత ప్రతిభతోనే ఈ స్థాయికి వచ్చానని తారా అన్నారు. ఎవరి అండదండలు లేకుండా స్వయంగా కష్టపడి పైకి రావాలనే తపన తారా దర్శన్ మాటల్లో కనిపిస్తుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో? ఆయన తన అనుభవాల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.