అమరన్ హీరో లైన్ ఛేంజ్ చేశాడు..!
ఇక వినాయక్ తో సినిమా కాస్త వెనక్కి వెళ్లడంతో ఆ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో శివ కార్తికేయన్ సినిమా లాక్ చేసుకున్నాడట.;
కోలీవుడ్ లో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు శివ కార్తికేయన్. అతను చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మంచి కథ.. మంచి కాంబినేషన్స్ లో శివ కార్తికేయన్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాయి. అదే దూకుడుతో శివ కార్తికేయన్ వరుస క్రేజీ కాంబినేషన్స్ ఫిక్స్ చేసుకుంటున్నాడు. శివ కార్తికేయన్ ప్రస్తుతం సుధ కొంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పీరియాడికల్ స్టూడెంట్ డ్రామాగా వస్తుంది. ఈ మూవీలో జయం రవి ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్ మురుగదాస్ డైరెక్షన్ లో మదరాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పరాశక్తి సినిమా 2026 సంక్రాంతికి వస్తుంటే.. మదరాసి ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలతో పాటు శివ కార్తికేయన్ గుడ్ నైట్ సినిమాతో సత్తా చాటిన డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్ డైరెక్షన్ లో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. అసలైతే శివ కార్తికేయన్ వినాయక్ సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఈ ఇయర్ మోహన్ లాల్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదని తెలిసి ఈ సినిమా కాస్త లేట్ గా మొదలు పెట్టాలని అనుకుంటున్నారట.
ఇక వినాయక్ తో సినిమా కాస్త వెనక్కి వెళ్లడంతో ఆ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో శివ కార్తికేయన్ సినిమా లాక్ చేసుకున్నాడట. సూర్య, విక్రం, విజయ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన వెంకట్ ప్రభు ఈసారి శివ కార్తికేయన్ తో తన మార్క్ మూవె చేయనున్నారట.
తప్పకుండా ఈ సినిమాతో శివ కార్తికేయన్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు. వెంకట్ ప్రభు సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉటాయి. ఐతే ఈమధ్య ఆయన కాస్త ఫాంలో లేరు. కానీ శివ కార్తికేయన్ ఫాంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా అతనితో సినిమా వర్క్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి ఈ కాంబో సినిమా కథ విషయాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.