మహేశ్ కూతురు.. మాస్ తెలంగాణ ట్విస్ట్.

కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయాయి. ఊహించని విధంగా సితార మాటల్లో మాస్ తెలంగాణ వైబ్స్ ఉట్టి పడుతున్నాయి.

Update: 2026-10-02 04:32 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని ఎప్పుడూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గానే ఉంటుంది. డ్యాన్స్ వీడియోలు, వెకేషన్ వ్లాగ్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ కిడ్, లేటెస్ట్ గా ఒక డిఫరెంట్ యాంగిల్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫాహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా కోసం ఆమె చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట మాస్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

మొన్నటి వరకు సితార ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేది. తెలుగు కూడా అక్కడక్కడా అలా టచ్ చేస్తూ వెళ్లేది. సాధారణంగా చిన్నప్పటి నుంచి వరల్డ్ స్కూల్స్, ఇంగ్లీష్ వాతావరణంలో పెరగడం వల్ల స్టార్ కిడ్స్ భాషా శైలి అలానే ఉంటుంది. సితార కూడా ఆ ఇంటర్నేషనల్ కల్చర్ లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చేది. భాష మీద పట్టు ఉన్నా, క్యాజువల్ కన్వర్జేషన్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే సాగేవి.

కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయాయి. ఊహించని విధంగా సితార మాటల్లో మాస్ తెలంగాణ వైబ్స్ ఉట్టి పడుతున్నాయి. ఏమాత్రం కృతిమత్వం లేకుండా, పక్కా లోకల్ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంత పెద్ద స్టార్ ఫ్యామిలీలో, గ్లోబల్ స్కూలింగ్ బ్యాక్ గ్రౌండ్ లో పెరిగిన అమ్మాయి, ఇలా అచ్చమైన తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టడం అందరికీ కొత్తగా అనిపిస్తోంది.

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాలో మ్యాజిక్ చేసే పాత్రలో నటించిన సారా పాలేకర్ తో కలిసి సితార ఈ వీడియో చేసింది. సారా మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తూ ఉంటే, దానికి సితార ఇచ్చే రియాక్షన్స్ చాలా నాచురల్ గా వచ్చాయి. ఆగు ఇటు రా, ఇట్లానా, అట్లానా అంటూ పక్కా హైదరాబాదీ యాసను చాలా క్యాజువల్ గా పలికించింది.

నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అని సారా అడిగినప్పుడు, మూన్ కి వెళ్దాం, ఆ తర్వాత మార్స్ కి పోదాం అంటూ సితార చెప్పిన విధానం భలేగా పేలింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే మన పక్కింటి అమ్మాయి మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది. ఇంగ్లీష్ స్లాంగ్ నుంచి ఇలా లోకల్ తెలంగాణ యాసలోకి మారడం అనేది ఆమె బ్రాండ్ ఇమేజ్ కు చాలా ప్లస్ అవుతుంది. పబ్లిక్ తో ఎలా కనెక్ట్ అవ్వాలో సితారకు బాగా తెలిసిపోయింది. కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, ఇలా లోకల్ స్లాంగ్ మీద పట్టు సాధించడం చూస్తుంటే సితార అడుగులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్తులో ఆమె సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తే, ఇదే తెలంగాణ యాసలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లలో రెస్పాన్స్ దద్దరిల్లడం ఖాయం.

Tags:    

Similar News