సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ ఆస్తి 157కోట్లు!

తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్ర‌ముఖ గాయ‌కుడి ఆస్తుల విలువ 157 కోట్లు. గాయ‌కుడు షాన్ ఒక్కో పాట‌కు 2 ల‌క్ష‌ల నుంచి 3ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటున్నాడు.;

Update: 2025-10-22 03:00 GMT

ఈ గాయ‌కుడు ఒక‌ప్పుడు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్. అమీర్ ఖాన్ సినిమాలో అత‌డు నేప‌థ్యంలో క‌నిపించాడు. అస‌లు అత‌డు ఎవ‌రో కూడా గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం. కానీ ఆ త‌ర్వాత అతడి జీవితం అనూహ్య మ‌లుపులు తిరిగింది. ప్ర‌ముఖ గాయ‌కుడిగా ఎదిగాడు. ఇండ‌స్ట్రీలో టాప్ సింగ‌ర్స్ లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కో పాట‌కు అత‌డు అందుకుంటున్న పారితోషికం చుక్క‌ల్లో ఉంది. ఇండియా బెస్ట్ సెల‌బ్రిటీలు నివ‌శించే చోట అత‌డు నివ‌శిస్తున్నాడు. అత‌డి ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్ల‌బెట్ట‌కుండా ఉండ‌లేరు. ఈ ప్ర‌ముఖ గాయ‌కుడు ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డి పేరు షాన్. యూత్ ని ఉర్రూత‌లూగించే గాత్రం అత‌డి సొంతం.

తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్ర‌ముఖ గాయ‌కుడి ఆస్తుల విలువ 157 కోట్లు. గాయ‌కుడు షాన్ ఒక్కో పాట‌కు 2 ల‌క్ష‌ల నుంచి 3ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటున్నాడు. ఒక్కో స్టేజీ షోకి 22 ల‌క్ష‌ల నుంచి 30ల‌క్ష‌ల మ‌ధ్య వ‌సూలు చేస్తాడు. 90 నిమిషాల క‌చేరీకి అత‌డు ఏకంగా 40ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటున్నాడు. భారీ పెళ్లి వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ఏకంగా 1.5 కోట్ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడు. ముంబైలో అత‌డు ఒక ఖ‌రీదైన అపార్ట్ మెంట్ లో నివ‌శిస్తున్నాడు. చ‌ద‌ర‌పు అడ‌గు సుమారు 45 ల‌క్ష‌లు. అత‌డికి ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. వీటి విలువ కోట్ల‌లో ఉంది. అత‌డు డ్రైవ్ చేసే బెంజ్ కార్ విలువ 1.2 కోట్లు. ముంబై రియ‌ల్ ఎస్టేట్ లో విస్తారంగా పెట్టుబ‌డులు పెట్టిన సెల‌బ్రిటీల పేర్ల‌లో షాన్ పేరు కూడా ఉంది. షాన్ అత‌డి భార్య రాధిక ముఖ‌ర్జీ పూణేలో 10 కోట్ల ఖ‌రీదైన భ‌వంతిని కూడా కొనుగోలు చేసారు.

గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా! అంటూ అత‌డి గొంతును కీర్తించారంటే షాన్ స్వ‌రంలో ప్ర‌త్యేక‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. బ్యాక్ గ్రౌండ్ లో డ్యాన్స‌ర్ గా ఎప్ప‌టికీ గుర్తింపు లేనివాడిగా మిగిలిపోవాల్సిన ప‌ని లేదు... స‌మ‌యస్ఫూర్తితో, త‌మ అభిరుచిని ప్రొఫెష‌న్ గా మ‌లుచుకుని ఎలాంటి విజ‌యం సాధించ‌వ‌చ్చో షాన్ నిరూపించి చూపించాడు. అత‌డి నుంచి నేటిత‌రం ప్రతిదీ నేర్చుకోవ‌చ్చు.

Tags:    

Similar News