'సింగ్ గీతం' మార్క్ మ్యాజిక్ ఇక‌ ప్రేక్ష‌కుల చేతుల్లోనే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

Update: 2026-06-11 18:39 GMT

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ప్రయోగాత్మక చిత్రాలకు కూడా అంతే స్థాయిలో ఆదరణ లభించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ లో సరికొత్త చర్చకు తెర తీసింది `సింగ్ గీతం` అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్. రొటీన్ మాస్ మసాలా ఫార్ములాకు భిన్నంగా.. సరికొత్త కథనంతో 94 ఏళ్ల ద‌ర్శ‌క దిగ్గ‌జం సింగీతం శ్రీనివాస‌ర‌వు రూపొందించిన చిత్ర‌మిది.

తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌యోగం అనే మాట‌ను పరిచ‌యం చేసిన ఓ లెజెండ్ డైరెక్ట్ చేసిన చిత్రం కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇలాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించాలని సినీ విశ్లేషకులు అంతే భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు సినిమాను కేవలం వినోద సాధనంగానే కాకుండా ఒక పండుగలా భావిస్తారు. అయితే పెద్ద స్టార్లు.. వారు క్రియేట్ చేసే హడావుడి నడుమ చిన్న సినిమాలు .. వినూత్నమైన టైటిల్స్, విభిన్నమైన కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు ఒక్కోసారి సరైన గుర్తింపునకు నోచుకోలేకపోతున్నాయి.

కంటెంట్‌లో ఎంత దమ్మున్నా? స్టార్ పవర్ లేకపోవడం వల్ల చిత్రాలు థియేటర్లలో నిలదొక్కుకోవడం సవాలుగా మారుతోంది. అందుకే కమర్షియల్ ఇమేజ్ పక్కన పెట్టి కేవలం కథను నమ్మి వచ్చే ఇలాంటి సరికొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల మద్దతు ఎంతో అవ‌స‌రం. `సింగ్ గీతం` వంటి చిత్రాల వెనుక ఎంతో మంది నూతన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కష్టం దాగి ఉంటుంది. టాలీవుడ్‌లో కొత్త తరం మేకర్స్ సరిహద్దులను బ్రేక్ చేస్తూ వినూత్న ప్రమాణాలతో కూడిన కథలను టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి ప్రయోగాలను తెలుగు ఆడియన్స్ మునుపెన్నడూ లేనంతగా ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమా బాగుంటే భాషతో లేదా బడ్జెట్‌తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పట్టే తెలుగు ఇండ‌స్ట్రీ వైవిధ్యమైన చిత్రానికి కూడా అదే తరహా వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకుల అభిరుచి చాలా వరకు మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ విభిన్నమైన కంటెంట్‌ను ఓటీటీల లో వీక్షిస్తూ సినిమా పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఆ మార్పు కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం కాకుండా థియేటర్ల వద్ద కూడా కనిపించాలి.

`సింగ్ గీతం` వంటి సినిమాల్లో ఉండే ఫ్రెష్ థాట్స్, కొత్త తరహా మేకింగ్‌ను థియేటర్లలోనే ఎంజాయ్ చేసినప్పుడే, మేకర్స్‌కు మరింత ఉత్సాహం లభిస్తుంది. కేవలం పెద్ద సినిమాలకే థియేటర్లు అనే అపోహను వీడి ఇలాంటి కంటెంట్-ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఓపెనింగ్స్ అందించేలా తెలుగు ఆడియన్స్ అడుగులు వేయాలి. ఒక పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదగాలంటే అక్కడ కమర్షియల్ హిట్స్ ఎంత అవసరమో? సమాంతరంగా ప్యారలల్ సినిమా .. ప్రయోగాత్మక చిత్రాల విజయం కూడా అంతే ముఖ్యం.

`సింగ్ గీతం` చిత్రానికి లభించే ఆదరణ కేవలం ఆ ఒక్క సినిమా విజయానికే పరిమితం కాదు. భవిష్యత్తులో మరెంతో మంది యువ దర్శకులు సరికొత్త ఆలోచనలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ఓ ధైర్యాన్ని ఇస్తుంది. రిస్క్ అని తెలిసినా కొత్తదనాన్ని నమ్ముకుని సినిమా తీసే నిర్మాతలకు ఈ విధమైన ప్రోత్సాహం ఆర్థికంగా .. మానసికంగా ఎంతో భరోసానిస్తుంది.

Tags:    

Similar News