నడుము వయ్యారాలతో ఆశలు రేకెత్తిస్తున్న సిమ్రాన్ చౌదరి!
ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.;
ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో ఫాలోవర్స్ కి ఊపిరాడకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యంగ్ హీరోయిన్లే కాదు సీనియర్ హీరోయిన్లు అలాగే స్టార్ హీరోయిన్లు కూడా ఇలా వయ్యారాలు వలకబోస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన అందంతో అభిమానులను మరొకసారి ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యింది సిమ్రాన్ చౌదరి.
గ్లామర్ తో హీట్ పెంచిన సిమ్రాన్ చౌదరి..
ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందులో తన అందాలతో అభిమానులకు ఆశలు రేకెత్తిస్తోంది అని చెప్పవచ్చు. తాజాగా బ్లాక్ కలర్ చీర కట్టుకున్న ఈమె తన మేని ఛాయను ఎలివేట్ చేస్తూ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. పైగా ఒక చేత్తో చీర కొంగును పైకి ఎత్తి.. నడుము వయ్యారాలని చూపిస్తూ..నాభి అందాలను హైలెట్ చేస్తూ గిలిగింతలు పెడుతోంది. ప్రస్తుతం సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఈ బ్లాక్ సారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన ఫాలోవర్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
12 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
సిమ్రాన్ చౌదరి విషయానికి వస్తే.. 1996లో హైదరాబాదులో జన్మించిన ఈ చిన్నది.. హైదరాబాదులోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత సెంట్ ఫ్రావిన్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. నటన పైన ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 12 ఏళ్ల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో నటించడం మొదలుపెట్టింది.
మిస్ ఫెమినా ఇండియాగా కిరీటం..
ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.. ఇక 2012లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా టైటిల్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ 2017లో మిస్ ఫెమినా ఇండియా తెలంగాణ అవార్డు సైతం సొంతం చేసుకుంది.
సిమ్రాన్ చౌదరి సినీ రంగ ప్రవేశం..
మోడలింగ్ చేస్తున్న సమయంలోనే 2014లో వచ్చిన 'హమ్ తుమ్' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది సిమ్రాన్ చౌదరి. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, చెక్, బొంభాట్, పాగల్, సెహరి , అథర్వ, ఆ ఒక్కటి అడక్కు , లవ్ మీ వంటి చిత్రాలలో నటించింది. 2024 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా అవకాశం అందుకోలేదు ఈ చిన్నది. కనీసం ఇప్పుడైనా దర్శకల నిర్మాతల కంట్లో పడి అవకాశాలు అందుకుంటుందేమో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలలో మళ్లీ అవకాశాలు అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.