సైమాలో సెలబ్రిటీలు చెప్పిన కబుర్లు..
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2025 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరుగుతున్నాయి.;
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2025 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అనౌన్స్ చేయగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి ఎంతోమంది స్టార్లు హాజరయ్యారు. సైమా ఈవెంట్ కు హాజరైన తారలు తమ సినిమాల గురించి పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను ఆడియన్స్ కు అందించారు. అవేంటో చూద్దాం.
సైమా2025 అవార్డుల్లో పుష్ప2 సినిమా సత్తా చాటింది. పుష్ప2 సినిమాకు సైమాలో ఎక్కువ నామినేషన్లు దక్కగా, ఐదు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డును దక్కించుకోగా, ఉత్తమ నటిగా రష్మిక, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్, బెస్ట్ సింగర్ గా శంకర్ బాబు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నారు.
పుష్ప3 కచ్ఛితంగా ఉంటుంది
ఈ ఈవెంట్ లో అవార్డు అందుకున్న తర్వాత సుకుమార్ ను హోస్ట్ పుష్ప3 గురించి అడగ్గా, అందరి అనుమానాలకు తెర దించుతూ పుష్ప3 కచ్ఛితంగా ఉంటుందిగా అని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే పుష్ప3 ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం సుకుమార్ చెప్పలేదు.
ఆ మాటకు గాల్లో తేలిపోయా
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తాజాగా ఓ సాంగ్ షూట్ చేశానని, అది విని పవన్ కళ్యాణ్ చాలా పొగిడారని, సాంగ్ విన్నాక పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇచ్చి అదరగొట్టావ్, నీ సాంగ్ తో చాలా రోజుల తర్వాత నాలో డ్యాన్స్ చేయాలనే ఆశ పుట్టిందన్నారని ఆయన మాటకు గాల్లో తేలిపోయానని మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ చెప్పారు.
ప్రభాస్ ప్రాజెక్టు కోసం రెడీగా ఉండండి
ప్రభాస్ తో చేసే ప్రాజెక్టు కోసం అందరినీ వెయిట్ చేయమని తప్ప మరేమీ చెప్పలేనని, ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాను స్టార్ట్ చేస్తామని చెప్పారు హను మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక మోక్షజ్ఞతో చేయబోయే సినిమా గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అనౌన్స్‌మెంట్వచ్చే వరకు తానేమీ రివీల్ చేయనని తెలిపారు.
అంతా రాజమౌళి చేతుల్లోనే ఉంది
ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నట్టే తాను కూడా రాజమౌళి- ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని, ఆ సినిమా రిలీజవాలని తాను కూడా చూస్తున్నానని, కానీ అదంతా రాజమౌళి చేతుల్లోనే ఉందని హీరో సుధీర్ బాబు అన్నారు.
అభిమానులే స్పూర్తి అంటున్న భాగ్యశ్రీ
తన ఫ్యాన్సే తనకు ఇన్సిపిరేషన్ అని, తానిప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగులేస్తున్నానని, ఎప్పటికీ అందరి సపోర్ట్ తనకు ఉండాలని కోరుకుంటున్నానని, ఫ్యూచర్ లో మరింత కష్టపడి వర్క్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నానని మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే చెప్పారు.