సైమా 2025 తమిళ, మలయాళ విజేతలు వీళ్లే

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదిలోనూ సౌత్ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ దుబాయ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.;

Update: 2025-09-07 10:44 GMT

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదిలోనూ సౌత్ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ దుబాయ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం రాత్రి తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అవార్డ్‌లను ప్రకటించారు. తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. తారా తోరణం గా నిలిచిన సైమా 2025 వేదిక కన్నుల పండుగగా నిలిచింది. కోలీవుడ్‌లో రూపొందిన అమరన్ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్ కి సైమా 2025లో ఉత్తమ చిత్రం అవార్డ్‌ దక్కింది. పలు కమర్షియల్‌ సినిమాలతో పాటు, ఆర్ట్‌ సినిమాలకు అవార్డులు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్‌ హిట్‌ కాని సినిమాలు సైతం సైమా అవార్డుల్లో తమ సత్తా చాటాయి.

సైమా 2025 అవార్డ్‌ కోలీవుడ్‌ విజేతలు :

ఉత్తమ చిత్రం : అమరన్‌

ఉత్తమ నటి : సాయి పల్లవి

ఉత్తమ దర్శకుడు : రాజ్ కుమార్‌ పెరియాసామి (అమరన్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ (అమరన్‌)

ఉత్తమ విలన్ : అనురాగ్‌ కశ్యప్‌ (మహారాజా)

ఉత్తమ నటుడు : కార్తీ (మెయ్యజగన్‌)

ఉత్తమ సహాయ నటుడు : దుషారా విజయన్‌ (రాయన్‌)

ఉత్తమ హాస్య నటుడు : బాల శరవణన్‌ (లబ్బర్ పందు)

ఉత్తమ దర్శకుడు : నిథిలన్‌ సామినాథన్‌ (మహారాజా)

ఉత్తమ డెబ్యూ నటుడు : హరీష్ కళ్యాణ్ (లబ్బర్ పందు)

స్పెషల్‌ అవార్డ్‌ : సంజనా కృష్ణమూర్తి (లబ్బర్‌ పందు)

ఉత్తమ కొత్త నటుడు : తమిళరాసన్‌ ( లబ్బర్ పందు)

సైమా 2025 అవార్డ్‌ మాలీవుడ్ విజేతలు :

ఉత్తమ చిత్రం : మంజుమ్మల్‌ బాయ్స్‌

ఉత్తమ దర్శకుడు : బ్లెస్సీ (ది గోట్ లైఫ్‌)

ఉత్తమ నటి : ఊర్వశి (ఉళ్లోళుక్కు)

ఉత్తమ హాస్య నటుడు: శ్యామ్‌ మోహన్‌ (ప్రేమలు)

ఉత్తమ విలన్‌ : జగదీష్ (మార్కో)

ఉత్తమ నటుడు : ఉన్ని ముకుందన్‌ (మార్కో)

ఉత్తమ కొత్త దర్శకుడు : జోజు జార్జ్‌ (పని)

ఉత్తమ సంగీత దర్శకుడు : దిబు నినన్‌ థామస్‌ (ఏఆర్‌ఎం)

Tags:    

Similar News