స్టార్ బాయ్.. ఈసారి డిఫరెంట్ ఛాయిస్..!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. డీజే టిల్లు ముందు వరకు అతన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే డీజే టిల్లు వచ్చిందో అతని రేంజ్ మారిపోయింది.;

Update: 2025-09-19 07:55 GMT

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. డీజే టిల్లు ముందు వరకు అతన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే డీజే టిల్లు వచ్చిందో అతని రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో జస్ట్ డైలాగ్స్ తోనే ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేశాడు సిద్ధు. ఆ క్రేజ్ తో టిల్లు స్క్వేర్, జాక్ సినిమాలు చేశాడు. టిల్లు స్క్వేర్ అనుకున్నట్టుగానే 100 కోట్లు కొట్టగా జాక్ మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. జాక్ సినిమా విషయంలో అన్ని వేళ్లు హీరో సిద్ధు వైపే చూపించాయి. బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథలో సిద్ధు ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవ్వడం వల్లే అవుట్ పుట్ అలా వచ్చిందన్న టాక్ వినిపించింది.

జాక్ ఇచ్చిన షాక్ తో సిద్ధు..

ఐతే జాక్ ఇచ్చిన షాక్ తో సిద్ధు జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా సినిమా చేస్తున్నాడు సిద్ధు. ఆ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ సినిమా చేయబోతున్నాడట. పరదా సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో సిద్ధు సినిమా ఉంటుందని టాక్. సినిమా బండితో సెన్సేషన్ అనిపించిన ప్రవీణ్ రీసెంట్ గా సమంత నిర్మాణంలో శుభం సినిమా చేశాడు. అది ఓకే అనిపించుకుంది.

ఐతే రీసెంట్ గా వచ్చిన పరదా మాత్రం నిరాశపరచింది. సినిమాను అసలు జనాలు పట్టించుకోలేదు. ప్రవీణ్ కూడా ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈసారి స్టార్ బాయ్ సిద్ధుతో ప్రవీణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇది అటు సిద్ధుకి, ఇటు ప్రవీణ్ ఇద్దరికి కూడా మంచి అటెంప్ట్ అయ్యేలా ఉంటుందట. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని అంటున్నారు. త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ ఇంకా మిగతా డీటైల్స్ వెల్లడిస్తారని తెలుస్తుంది.

అసలు సిసలైన టాస్క్..

ప్రవీణ్ కండ్రేగుల సిద్ధు జొన్నలగడ్డ డెఫినెట్ గా ఈ కాంబో మూవీ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఐతే డిఫరెంట్ గా సినిమా తీయడం వరకు కాదు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే ఇప్పుడు అసలు సిసలైన టాస్క్ గా మారింది. మరి ఈ విషయంలో ఈ కాంబో మేకర్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా తర్వాత బడాస్ అనే సినిమాతో పాటు కోహొనూర్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. వీటితో పాటు ప్రవీణ్ తో సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News