సిద్ధు తెలుసు కదా.. ఆ ఛాన్స్ ఉంటుందా..?

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా జాక్ సినిమాతో వచ్చి నిరుత్సాహపరిచాడు.;

Update: 2025-06-02 03:00 GMT

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా జాక్ సినిమాతో వచ్చి నిరుత్సాహపరిచాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాక్ సినిమా ఆడియన్స్ ని అలరించడంలో విఫలమైంది. సినిమా ఎందుకో సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి అంతగా బజ్ తీసుకు రాలేదు. రెండు సూపర్ హిట్లు అందులోనూ 100 కోట్లు కొట్టిన తర్వాత సిద్ధు నుంచి వచ్చిన సినిమా ఇలా డిజప్పాయింట్ చేయడం షాక్ ఇచ్చింది. ఐతే ఈ ఫలితం ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమా మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.

ప్రస్తుతం సిద్ధు నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా సినిమా చేస్తున్నాడు. సినిమాలో సిద్ధుతో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హిట్ 3 తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత శ్రీనిధి చేస్తున్న సినిమా కాబట్టి తెలుసు కదాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే తెలుసు కదా ఒక యూత్ ఫుల్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది. సిద్ధు మార్క్ కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా కుదుతుందని అంటున్నారు.

ఐతే తెలుసు కదా సినిమా మళ్లీ టిల్లు స్క్వేర్ తరహాలో 100 కోట్లు కొడుతుందా అన్న డౌట్ మొదలైంది. ఎందుకంటే టైటిల్ చాలా సాఫ్ట్ గా ఉంది. ఇదొక లవ్ స్టోరీగా ఉండబోతుంది. ఐతే లవ్ స్టోరీకి 100 కోట్లు వస్తాయా అన్న డౌట్ మొదలైంది. ఐతే సరైన బజ్ క్రియేట్ చేసి మంచి ట్రీట్ మెంట్ తో ఆడియన్స్ కి అందిస్తే తప్పకుండా అది లవ్ స్టోరీ సినిమా అయినా బ్లాక్ బస్టర్ చేస్తారు. దీనికి ఉదహరణగా ఉప్పెనని తీసుకోవచ్చు.

ఆ సినిమా చాలామందికి తొలి సినిమా అయినా సరే 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో తెలుసు కదా కలెక్షన్స్ విషయంలో డౌట్ పడాల్సిన పనిలేదు. ఆల్రెడీ సిద్ధు రీసెంట్ మూవీ అంచనాలను అందుకోలేదు కాబట్టి నెక్స్ట్ సినిమా మీద అతని ఫ్యాన్స్ గురి ఉంటుంది. అందుకే సిద్ధు కూడా తెలుసు కదా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాను అక్టోబర్ 17న దివాళి కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు. మరి తెలుసు కదా తో సిద్ధు ఏ రేంజ్ ఫలితాన్ని అందుకుంటాడు అన్నది చూడాలి.

Tags:    

Similar News