ఫైనల్‌గా టిల్లు డేట్ ఫిక్స్ చేసేశాడు!
సిద్దూ జొన్నలగడ్డ.. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. పక్కా ఓల్డ్ సిటీ స్లాంగ్‌తో సాగిన టిల్లు క్యారెక్టర్ సిద్దూకు తిరుగులేని ఇమేజ్‌తో పాటు భారీ విజయాలన్ని అందించింది.;
సిద్దూ జొన్నలగడ్డ.. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. పక్కా ఓల్డ్ సిటీ స్లాంగ్‌తో సాగిన టిల్లు క్యారెక్టర్ సిద్దూకు తిరుగులేని ఇమేజ్‌తో పాటు భారీ విజయాలన్ని అందించింది. అయితే ఇదే ఇమేజ్ ఇప్పుడు సిద్దూను ఇబ్బందికి గురి చేస్తోంది. దాని నుంచి బయటపడాలనే ఆలోచనతో సిద్దూ చేస్తున్న రొమాంటిక్ లవ్ డ్రామా `తెలుసు కదా`. ఈ మూవీకి నీరజ కోన దర్శకత్వం వహిస్తోంది.
క్రేజీ స్టార్స్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించిన నీరజ కోన తొలిసారి మెగా ఫోన్ పడుతూ ఈ మూవీ ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్‌గా `జాక్` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి చేతుల కాల్చుకున్న సిద్దూ జొన్నలగడ్డ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే ప్లాన్‌లో ఉన్నాడు. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది.
ఈ మూవీని అక్టోబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ కోసం విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య సాండ్ విచ్‌లా నిలిగిపోయే లవర్ బాయ్ క్యారెక్టర్‌లో సిద్దూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడా టిల్లు ఫ్లేవర్ కనిపించకుండా సిద్దూ జగ్రత్తపడుతూ ఈ మూవీ చేసినట్టుగా తెలుస్తోంది.
స్టైల్, మేకోవర్, డైలాగ్ డెలివరీ వంటి విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుని సిద్దూ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడట. ఎనర్జిటిక్ క్యారెక్టర్‌లో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న ఈ మూవీని ఫైనల్‌గా దీపావళికి అక్టోబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. లేడీ డైరెక్టర్ నీరజ కోనతో పాటు సిద్దూకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా మారిన `తెలుసు కదా` ఈ ఇద్దరికి సక్సెస్‌ని అందిస్తుందా లేక షాక్ ఇస్తుందా? అన్నది తెలియాలంటే అక్టోబర్ 17 వరకు వేచి చూడాల్సిందే.