20 రోజుల‌కే ఓటీటీకి వ‌చ్చేస్తున్న స్టార్ బాయ్ మూవీ!

తెలంగాణ యాస‌తో పాత‌బ‌స్తీ నేప‌థ్యంలో సాగే క‌థ‌తో రూపొందిన మూవీ హీరోగా సిద్దూకు తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది;

Update: 2025-04-24 12:45 GMT

డీజే టిల్లు` మూవీతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ‌య్చేసిన హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌. తెలంగాణ యాస‌తో పాత‌బ‌స్తీ నేప‌థ్యంలో సాగే క‌థ‌తో రూపొందిన మూవీ హీరోగా సిద్దూకు తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. సితార వారు కేవ‌లం 5 కోట్ల‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో రూ.30 కోట్లు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ మూవీ స‌క్సెస్‌తో మాంచి క్రేజ్‌ని ద‌క్కించుకున్న సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ ఇదే క్యారెక్ట‌ర్‌తో సీక్వెల్ చేశాడు.

అదే `టిల్లు స్క్వేర్‌`. టిల్లు స‌క్సెస్‌తో మాంచి జోష్‌మీదున్న సిద్దూ త‌న‌కు తానే ఈ మూవీకి స్టార్ బాయ్ అనే ట్యాగ్‌ని వేసుకున్నాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించ‌లేక‌పోయింది. యావ‌రేజ్ ఫిల్మ్‌గా నిలిచి ఓ విధంగా షాక్ ఇచ్చింది. అయినా స‌రే టిల్లు హాంగోవ‌ర్ నుంచి బ‌య‌టికి రాని స్టార్ బాయ్ ఇదే ఫార్ములాతో చేసిన మూవీ `జాక్‌`.

బేబీఫేమ్ వైష్ణ‌వీ చైత‌న్య హీరోయిన్‌గా న‌టించ‌గా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో బ‌డ్జెట్ పెరిగిపోయిన ఈ మూవీ ఫైన‌ల్‌గా ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుని మేక‌ర్స్‌కి షాక్ ఇచ్చింది. సిద్దూ క్రేజ్‌కు మించిన బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ కేవ‌లం రూ.9 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టి ఊహించ‌ని షాక్ ఇచ్చింది.

నిర్మాత‌కు భారీ న‌ష్టాల‌ని మిగిల్చిన ఈ మూవీ విడుద‌లై 20 రోజులు కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫిక్స్ ఈ మూవీ నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల్ని భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. అందులో భాగంగానే ఆ మొత్తాన్ని రిక‌వ‌రీ చేసుకునే క్ర‌మంలో `జాక్‌` మూవీని 20 రోజుల వ్య‌వ‌ధిలోనే ఓటీటీలోకి తెచ్చేస్తోంది. మే 1 నుంచి `జాక్‌` మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ `జాక్‌` స్ట్రీమింగ్ కానుండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News