సినిమా పోతే నా వల్లేనని అంటున్నారు.. అయినా నేను రెడీ: సిద్ధు
దీంతో సిద్ధు ఇటీవల ప్రెస్ మీట్ ను నిర్వహించి.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. దీపావళి సందర్భంగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో సిద్ధు ఇటీవల ప్రెస్ మీట్ ను నిర్వహించి.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానున్న తెలుసు కదా మూవీ ఒరిజినల్ సినిమా అని తెలిపారు సిద్ధు. ఇప్పటి వరకు చూడని సీన్స్.. అందులో ఉంటాయని చెప్పారు. ప్రేమ పెళ్లిళ్లు, కుటుంబ అనుబంధాలపై చర్చను లేవనెత్తేలా సినిమా ఉంటుందని పేర్కొన్న సిద్ధు.. మూవీలో కన్వర్జేషన్లు బలంగా మనసుకు తాకేలా ఉంటాయని చెప్పారు జొన్నలగడ్డ.
సినిమా స్టోరీలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మూవీ చేయాలనేది తన కల అని తెలిపారు సిద్ధు జొన్నలగడ్డ. డైలాగ్ చెప్పేసి కార్ వ్యాన్ లోకి వెళ్లి కూర్చోవాలని తనకు కూడా ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. కానీ తనకు ఎప్పుడూ అంత సౌకర్యం లేదని తెలిపారు. తాను కథల్లో జోక్యం చేసుకున్నానంటే కారణం.. ఎవ్వరూ కథలు చెప్పకపోవడమేనన్నారు.
అయితే తన కోసం ఎవ్వరూ కథలు రాయలేదని సిద్ధు వెల్లడించారు. అందుకే సినిమా ఎలా తీయాలో, కథలు ఎలా రాయాలో తాను ఇప్పటికే నేర్చుకోవాల్సి వచ్చిందని అన్నారు. నేర్చుకున్న అని కూడా చెప్పారు. అయితే ఏదైనా సినిమా.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక.. మంచి హిట్ అయ్యాక.. మెప్పించాక అందరికీ పేరొస్తుందని సిద్ధు తెలిపారు.
కానీ సినిమా రిజల్ట్ ఏమైనా తేడా కొడితే తాను జోక్యం చేసుకోవడంతో అనే విమర్శలు ఎప్పుడూ వస్తుంటాయని పేర్కొన్నారు. అయితే అలాంటివి స్వీకరించేందుకు సిద్ధపడే ఇక్కడ తాను ఉన్నానని చెప్పారు. అదే సమయంలో కొత్త దర్శకులతో కలిసి సినిమా చేయడం రిస్క్ తో కూడుకున్న పనే, కానీ దాని వెనక కొన్ని ప్రయోజనాలు ఉంటాయన్నారు.
అయితే సినిమాలో వరుణ్ అనే యువకుడిగా కనిపిస్తానని చెప్పిన సిద్ధు.. తనది బలమైన పాత్ర అని తెలిపారు. కచ్చితంగా ప్రేక్షకులు షాక్ అవుతారని అంచనా వేశారు. మూవీలోని తన పాత్ర ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని చెప్పుకొచ్చారు. కామెడీ పంచుతుందని, సినిమా విడుదల తర్వాత ఒక ప్రత్యేకమైన జానర్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.