సిద్ధార్థ్‌లో ఈ మార్పుకు కారణం అదేనా?
నయనతార, మాధవన్‌లతో కలిసి సిద్ధార్ధ్ నటించిన `టెస్ట్` మూవీ ఫ్లాప్ అయి తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే.;

నయనతార, మాధవన్‌లతో కలిసి సిద్ధార్ధ్ నటించిన `టెస్ట్` మూవీ ఫ్లాప్ అయి తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సిద్ధార్ధ్ ఫ్యామిలీ డ్రామా `3BHK`తో రాబోతున్నాడు. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీతా రఘునాథ్, చైత్ర జె.అచర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీగణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అరవింద్ సచిదానందన్ షార్ట్ స్టోరీస్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో సిద్ధార్ధ్ ప్రమోషన్స్ ప్రారంభించాడు. ఇందు కోసం పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ చానెళ్లకు వరుగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సిద్ధార్ధ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. `ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్‌లు, ఇంటర్వ్యూల తరువాత ఏర్పడిన అంచనాల కారణంగా సినిమా వారిని సంతృప్తిపరచలేకపోతే ప్రేక్షకులు నిరాశ చెంది తిడతారు.
ఎవరిరైనా `3BHK` పోస్టర్లు, మ్యూజిక్ నిజంగా ఇష్టపడితేనే సినిమా చూడండి. కానీ నా మాటలను పరిగణలోకి తీసుకుని మాత్రం సినిమాకు రాకండి. ఓవర్‌గా అంచనాల్ని పెంచేసి ప్రేక్షకుల్ని నిరాశపరచాలని నేను భావించడం లేదు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల రియాలిటీ ఎంటన్నది తెలుసుకోలేరు` అన్నారు. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధార్ధ్ మాటలు విన్న నెటిజన్‌లు ఇప్పటికి తనకు తత్వం బోధపడిందని, చాలా మెచ్యూర్‌గా సిద్ధార్ధ్ మాట్లాడుతున్నాడని కామెంట్‌లు చేస్తున్నారు.
ఉన్నట్టుండీ సిద్ధార్ధ్‌లో ఈ మార్పుకు కారణం `ఇండియన్ 2` దారుణంగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడమేనని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సిద్ధార్ధ్ చాలా యారగెంట్‌గా, యాటిట్యూడ్‌తో మాట్లాడి పబ్లిక్‌ని తీవ్రంగా ఇరిటేట్ చేసిన విషయం తెలిసిందే. అతని మాటలకు నెటిజన్‌లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేసి తన గాలి తీసేశారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న సిద్ధార్ధ్ `3BHK` మూవీ ప్రమోషన్స్‌లో మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సిద్ధార్థ్‌లో ఇంత మార్పా? అని అంతా అవాక్కవుతున్నారు.