భారతీయ సినిమాల్లో హైపర్ మాస్క్యూలినిటీ ట్రెండ్!
తాజాగా `ఆపరేషన్ సఫేద్ సాగర్` వెబ్ ప్రాజెక్ట్‌లో కార్గిల్ యుద్ధ వీర సైనికుడు, అమరవీరుడైన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో సిద్ధార్థ్ నటించారు.
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆల్ఫా మేల్.. హైపర్‌మాస్క్యూలినిటీ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. తెరపై హీరోలంటేనే ఉగ్రత, రక్తపాతం, హింస , దూకుడు ప్రదర్శించడం ట్రెండ్‌గా మారింది. అయితే ఈ తరహా పాత్రల జోరు ఎక్కువగా ఉన్నా? చిత్ర పరిశ్రమలో సున్నితమైన, హుందా అయిన శాంత స్వభావం గల పురుష పాత్రలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని నటుడు సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు.
తాజాగా `ఆపరేషన్ సఫేద్ సాగర్` వెబ్ ప్రాజెక్ట్‌లో కార్గిల్ యుద్ధ వీర సైనికుడు, అమరవీరుడైన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో సిద్ధార్థ్ నటించారు.
ఆ పాత్ర స్వభావం ఎంతో సాఫ్ట్‌గా, బాధ్యతాయుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన సినిమాలో మారుతున్న పోకడలపై మనసులోని మాటలను పంచుకున్నారు. `నేను నా కెరీర్‌లో ఇప్పటి వరకు ప్రతి సినిమాలోనూ మర్ద్ వైవిథ్యమైన పురుష పాత్రలే చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఇండస్ట్రీలో ఒక స్థానం దక్కిందంటే.. నా తరహా మాస్క్యూలినిటీకి ఎప్పటికీ ఇక్కడ చోటు ఉంటుందనే అర్థం` అని సిద్ధార్థ్ స్పష్టం చేశారు.
సరైన ఉద్దేశంతో చేసే ఏ ప్రయత్నమైనా ప్రేక్షకాదరణ పొందుతుందని.. అదే తనను ముందుకు నడిపిస్తుందని సిద్దార్ద్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం సున్నితమైన పాత్రలనే కాకుండా స్క్రీన్‌పై కనిపిస్తున్న దూకుడు స్వభావం గల పాత్రల ప్రాముఖ్యతను కూడా ఆయన సమర్థించారు. కథల్లో వైవిధ్యం ఉండాలని, ప్రతి పాత్ర వెనుక బలమైన ఉద్దేశం ఉంటుందని చెప్పారు. మనం వంద శాతం అన్ని విషయాలు ముందుగానే ఊహించగలిగినప్పుడు ఒక రకమైన మాస్క్యూలినిటి కనిపిస్తుంది.
కానీ ఏం జరుగుతుందో? అసలు తెలియని క్లిష్ట పరిస్థితుల్లో మనుషులు తమను తాము ఎలా నిరూపించుకుంటారు అనే దానిపైనే కథలు నడుస్తాయి` అని వివరించారు. తాను నటించిన `ఆపరేషన్ సఫేద్ సాగర్` ప్రాజెక్ట్ గురించి స్పందించారు. ఇది కేవలం యుద్ధానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. పిన్న వయస్సులో దేశం కోసం సాహసాలు చేసిన యువకుల ప్రయాణం అని అన్నారు.
అత్యంత ఎత్తైన ప్రాంతంలో, రాత్రి సమయాల్లో సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వహించిన ఆ యువ అధికారుల భావోద్వేగాలను ఈ సిరీస్ అద్భుతంగా ఆవిష్కరిస్తుందని తెలిపారు. కమర్షియల్ చిత్రాల్లో హీరోలంటే మాస్ యాక్షన్ ..వయొలెన్స్ మాత్రమే అనే అభిప్రాయాలు మారుతున్న తరుణంలో సిద్ధార్థ్ అభిప్రాయాలు సినీ .. ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారాయి. విభిన్నమైన కథాంశాలతో పాటు అర్థవంతమైన పాత్రలకు కూడా ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనం పడుతారనేదానికి ఈ వ్యాఖ్యలు మరింత అద్దం పడుతున్నాయి.