బాబీ ప్రామిస్‌తో 'కాకా'పై ఎక్స్‌పెక్టేషన్స్ స్కైహై!
ఈ సినిమా కోసం థమన్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తూ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోనే విపరీతంగా ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదలైన ‘కాకా’ గ్లింప్స్ టీజర్ అభిమానులను ఊపేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరు, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. బాబీ మార్క్ మాస్ ఎలివేషన్స్, థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూపుదిద్దుకున్న ఈ టీజర్, రాబోయే రోజుల్లో థియేటర్లలో ఏ స్థాయిలో మాస్ జాతర ఉండబోతోందో ముందే శాంపిల్ చూపించింది. ఆ విశేషాలు ఇలా వున్నాయి..
రొయ్యల ఫ్యాక్టరీ ఓనర్.. వెనుక పెద్ద కథే ఉంది:
ఈ సినిమాలో చిరంజీవి ‘సత్యం’ అనే పాత్రలో కనిపించనున్నారు. బయటికి రొయ్యల ఫ్యాక్టరీ నడుపుతూ, కూతురు అమ్ము (అనస్వర రాజన్) ప్రాణంగా బ్రతికే సాదాసీదా మిడిల్ క్లాస్ మనిషిలా కనిపిస్తారు. కానీ ఆయన వెనుక తుపాకులు, రక్తపాతం, శత్రువుల సమూహంతో కూడిన ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. బాబీ రాసుకున్న ఈ మాస్ ఎలివేషన్స్, సీన్స్ అభిమానులకు పిచ్చెక్కిస్తాయని తెలుస్తోంది.
థమన్ రీమిక్స్ మ్యాజిక్.. గ్రాండ్ కాస్టింగ్:
ఈ సినిమా కోసం థమన్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తూ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోనే విపరీతంగా ఆకట్టుకుంది. సునీల్, గెటప్ శీను, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబీ మార్క్ ఇంటర్వెల్ బ్యాంగ్స్, యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాలో వేరే లెవెల్‌లో ఉండబోతున్నాయని ఫిలిం నగర్ టాక్.
సంక్రాంతి సెంటిమెంట్.. రేసులో 'మెగా' మార్క్ హిట్లు:
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. గతేడాది పండగ బరిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర్ వరప్రసాద్' మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో రాబోతున్న ఈ కొత్త చిత్రం కూడా సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వరసగా సంక్రాంతి బరిలోకి దిగుతూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుండటంతో, టాలీవుడ్‌లో పక్కా సంక్రాంతి హీరోల లిస్ట్‌లో మెగాస్టార్ పేరు అగ్రస్థానంలో చేరిపోయిందని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పండగ బరిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే లక్ష్యంగా బాబీ ప్రతీ సీన్‌ను చెక్కుతున్నారు. 'వాల్తేరు వీరయ్య'తో అదిరిపోయే సక్సెస్ పార్టీ ఇచ్చినఈ కాంబో చిరంజీవి, మళ్లీ అదే జోష్‌తో సంక్రాంతికి థియేటర్లలో కాక రేపడానికి సిద్ధమయ్యారు.
మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బాబీ, మెగాస్టార్‌ను ఏ స్థాయిలో ప్రెజెంట్ చేస్తారో ఇప్పటికే రుజువైంది. ఇక గ్యాంగ్‌స్టర్ నేపధ్యంతో రాబోతున్న ఈ సినిమా పండగ బరిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడటానికి మెగా అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు..