వాణీ.. వ‌య‌సు పెరుగున్నా క‌వ్వింత త‌గ్గ‌డం లేదు

వార్, బ్యాండ్ బాజా బారాత్ , ఆహా కళ్యాణం వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వాణీ కపూర్.

Update: 2026-08-23 11:50 GMT

వార్, బ్యాండ్ బాజా బారాత్ , ఆహా కళ్యాణం వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వాణీ కపూర్. తన గ్లామర్ - నటనతో అలరించిన ఈ బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. రీసెంట్‌గా వాణీ తన పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ప్రత్యేకమైన పోస్ట్ ఇప్పుడు అంతర్జాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.




తన బర్త్‌డే వేడుకల్లో భాగంగా వాణీ కపూర్ బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో నీలిరంగు బికీనీ ధరించి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సూర్యుని చుట్టూ మరో ఏడాదైంది.. జీవితాన్ని అర్థం చేసుకోవడం తగ్గించి... దానిలో పూర్తిగా జీవించడం నేర్చుకున్నాను.. మరిన్ని స్మైల్స్.. రాబోవు సమయం కోసం సిద్ధంగా ఉన్నాను! అనే అర్థం వచ్చేలా ఒక భావోద్వేగపూరితమైన క్యాప్షన్‌ను దీనికి జత చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారి దాదాపు 81 వేల లైకులు.. 14 వందలకు పైగా కామెంట్లను రాబట్టింది.




వాణీ కపూర్ షేర్ చేసిన ఈ హాట్ లుక్స్‌పై సాటి సెలబ్రిటీలు, తోటి నటీనటులు పెద్ద ఎత్తున స్పందించారు. రాశీ ఖన్నా, సోఫీ చౌదరి, నిమ్రత్ కౌర్, అనుష్క రంజన్, జాస్మిన్ భాసిన్ వంటి ప్రముఖులు ఫైర్ ఎమోజీలతో పాటు, ``సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మరింత అందంగా మారుతున్నావు`` అని ప్రశంసిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వాణీ ఫిట్‌నెస్, బోల్డ్‌నెస్‌కు అందరూ ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపించారు.




ఇక అభిమానుల స్పందన అయితే మరీ విపరీతంగా ఉంది. బ్లూ బికీనీలో వాణీ గ్లో చూస్తుంటే ఇంటర్నెట్‌ను షేక్ చేసినట్లు ఉంది... బర్త్‌డే రోజు నిజమైన ధమాకా విసిరింది! అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ఎంత వయసు దాటుతున్నా చెక్కుచెదరని వాణీ గ్లామర్, ఫిట్‌నెస్.. కాన్ఫిడెన్స్‌ను పొగుడుతూ ``బాలీవుడ్‌లో అత్యంత అండర్ రేటెడ్ అందగత్తె`` అని అభివర్ణిస్తూ శుభాకాంక్షలు అందించారు. వాణీ స్ట‌న్నింగ్ బికినీ ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని ఒక రేంజులో షేక్ చేస్తున్నాయి.

ప్రస్తుతం వాణీ కపూర్ సినీ కెరీర్ విషయానికి వస్తే... గతంలో ఉన్నంత జోరు వెండితెరపై ప్రదర్శించలేకపోతోందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ ``సర్వగుణ్ సంపన్న్స .. బద్తమీజ్ గిల్`` అనే రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నా సినిమాల పరంగా వేగం కొంత నెమ్మదించింది. అయితే మోడల్‌గా వాణీకి ఉన్న క్రేజ్‌తో పలు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలలో నటిస్తూ.. సోషల్ మీడియా షేరింగ్‌ల ద్వారా భారీగా ఆర్జిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.

Tags:    

Similar News