కండోమ్ ఎఫెక్ట్.. అశ్లీల చిత్రాల కేసులో నటిపై నాన్ బెయిలబుల్ కేసు
మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.;
మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు ఆమెపై ఐటీ చట్టంలోని 67A సెక్షన్‌తో పాటు, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నాయికగా తనదైన ముద్ర వేసుకున్న శ్వేతపై, అనైతికంగా డబ్బు సంపాదించేందుకు అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రకటనల్లో నటించారన్న ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
ఈ కేసుకు కారణంగా ప్రధానంగా పలేరి మాణిక్యం, రతినిర్వేదం, కలిమన్ను వంటి సినిమాల్లో శృంగార దృశ్యాల్లో నటించడమే కాకుండా, ఆమె కండోమ్ ప్రకటనల్లో కూడా కనిపించారన్నది పిటిషన్‌లో ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఇవే సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందాయని, ఇందువల్ల శ్వేతా లాభపడిందన్న ఆరోపణలపై కోర్టు విచారణ జరిపింది. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ కేసు నమోదవడం ఇప్పుడు 'అమ్మ' ఎన్నికల ప్రాధాన్యతను మరింత పెంచింది. అసలు మొదట ఆరుగురు అభ్యర్థులు నామినేట్ అవ్వగా.. చివరకు పోటీ లో నిలిచింది శ్వేతా మీనన్, దేవన్ మాత్రమే. శ్వేతా గెలిస్తే ‘అమ్మ’ తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తారు. అయితే ఎన్నికల నడుమ ఇలాంటి కేసు రావడం ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది. దీనిపై మిగిలిన అభ్యర్థులు, పరిశ్రమ ప్రముఖులు మౌనం పాటిస్తుండటంతో ఇంకా ఆసక్తికరంగా మారింది.
గతంలో మలయాళ చిత్రపరిశ్రమలో మహిళా హక్కుల అంశాలు, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు పెద్దగా చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మహిళలకు అవకాశం ఇవ్వాలన్న వాదన బలపడుతోంది. తాజా కేసుతో మళ్లీ పరిశ్రమలో లింగ వివక్ష, నైతిక విలువలపై పెద్ద చర్చ మొదలైంది. గతంలో కూడా లీడర్‌షిప్ మార్పు సమయంలో ఇలాంటి సమస్యలు చర్చకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
శ్వేతా మీనన్‌పై అభియోగాలు రావడంతో ఆమెకు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం సినీ రంగంలో ఉండే వారికి నైతిక బాధ్యతలు ఉండాలని, పబ్లిక్ ఫిగర్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా 'అమ్మ' ఎన్నికల సమయంలో ఈ కేసు దాదాపు ఎన్నికల తీర్పును ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ముందు శ్వేతా మీనన్‌పై నమోదైన కేసు ఎలా పరిష్కారం అవుతుందో, ఆమె ఎన్నికల్లో గెలిచి మొదటి మహిళా అధ్యక్షురాలిగా నిలుస్తారో లేదో చూడాలి.