అమ్మ పీఠంపై తొలి మ‌హిళా అధ్య‌క్షురాలిగా

ఆసోసియేష‌న్ ఆఫ్ మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (అమ్మ‌) ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ న‌టి శ్వేతా మీన‌న్ జ‌య‌కేత‌నం ఎగ‌రేసారు.;

Update: 2025-08-16 04:32 GMT

ఆసోసియేష‌న్ ఆఫ్ మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (అమ్మ‌) ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ న‌టి శ్వేతా మీన‌న్ జ‌య‌కేత‌నం ఎగ‌రేసారు. అమ్మ సంఘానికి అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌య్యారు. ఓవైపు పోలీస్ కేసును ఎదు ర్కుంటూనే అమ్మ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. అలాగే అమ్మ కు తొలి మ‌హిళా అధ్య‌క్షు రాలిగానూ శ్వేతామీన‌న్ రికార్డు నెలకొల్పారు. ఇంత వ‌ర‌కూ అధ్య‌క్షులుగా ప‌నిచేసిన వారంతా మేల్ న‌టులే. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో శ్వేతా మీన‌న్ బరిలోకి దిగ‌డంతో ప్ర‌త్య‌ర్ది వ‌ర్గం దేవ‌న్ గ‌ట్టి పోటీ నిచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ల‌క్ష్మీ ప్రియ ఉపాధ్యక్షురాలిగా, కుక్కు ప‌ర‌మేశ్వ‌ర‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీగా, అన్సీబా హ‌న్సల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నిక‌య్యారు. శుక్ర‌వారం ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి 1 గంట వ‌ర‌కూ కొచ్చిలో ఓటింగ్ జ‌రిగింది. 506 మంది స‌భ్యుల‌కు ఓటు హ‌క్కు ఉండ‌గా 298 మంది ఓటేశారు. చాలా మంది పేరున్న న‌టుల్లో ఎన్నిక‌ల్లో పాల్గొన‌లేదు. మ‌మ్ముట్టి, ఫ‌హాద్ పాజిల్, పృధ్వీరాజ్ సుకుమార‌న్ , నివిన్ పౌలీ వంటి స్టార్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ల‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 70 శాతం పోలింగ్ న‌మోదు కాగా, ఈసారి 58 శాతం రికార్డు అయింది.

స‌రిగ్గా ఎన్నిక‌ల ముందే శ్వేతా మీన‌న్ అడ‌ల్ట్ చిత్రాల‌పై పోలీస్ కేసు న‌మోద‌వ్వ‌డం సంచల‌నంగా మారింది. దీంతో ఎన్నిక‌ల్లో ఆమె గెలుస్తారా? లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా అడ్డుకోవాల‌నే కొంద‌రు కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మాలీవుడ్ మీడియాలో ప్ర‌చా రం జ‌రిగింది. ఉద్దేశ పూర్వ‌కంగానే అస‌భ్య‌క‌ర చిత్రాల్లో, ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింద‌ని ఎర్నాకుళం సెంట్ర‌ల్ పోలీస్ స్టేష‌న్ లో కేసు వేశారు. ఈ నేప‌థ్యంలో శ్వేతా మీన‌న్ కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా న్యాయ‌మూర్తి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసారు.

మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా మ‌హిళా ఆర్టిస్టుల వేధింపులపై జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. దీంతో అమ్మ సంఘానికి అప్ప‌టి కార్య‌వ‌ర్గం మూకుమ్మ‌డి గా రాజీ నామాలు స‌మర్పించింది. అధ్య‌క్షుడిగా ఉన్న మోహ‌న్ లాల్ రాజీనామా చేయ‌డంతో ఆయ‌న‌తో పాటు చాలామంది రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News