ఎర్రటి చీరలో సెగలు రేపుతున్న శృతి హాసన్.. వైరల్ అవుతున్న 'రెడ్ హాట్' పిక్స్!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ తన యాక్టింగ్‌తోనే కాదు.. స్టైలిష్ లుక్స్‌తోనూ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ తన యాక్టింగ్‌తోనే కాదు.. స్టైలిష్ లుక్స్‌తోనూ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నిలువెల్లా ఎరుపు రంగు ఫ్యూజన్ శారీలో శృతి హాసన్ ఇచ్చిన ఫోజులు ఫ్యాన్స్ గుండెల్లో మంటలు రేపుతున్నాయి. ఈ సరికొత్త ఫోటోషూట్ విశేషాలతో పాటు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి తెలుసుకుందాం..
శృతి హాసన్ 'రెడ్ హాట్' లుక్:
తాజా ఫోటోషూట్ కోసం శృతి హాసన్ పక్కా మోడ్రన్, ట్రెండీ లుక్‌ను సెలెక్ట్ చేసుకుంది. లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ 'మిని సోంధి' డిజైన్ చేసిన ఎరుపు రంగు మోడ్రన్ ఫ్యూజన్ శారీలో ఆమె మెరిసిపోయింది. ఈ హాట్ పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "An a day keeps the devil away … maybe" (రోజుకో యాపిల్ తింటే దెయ్యం దూరంగా ఉంటుందేమో) అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
అదిరిపోయే శారీ స్టైల్:
శృతి కట్టుకున్న ఈ చీర నార్మల్ శారీలా కాకుండా, చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ప్రీ-స్టిచ్డ్ మోడ్రన్ డ్రేప్ శారీ. ఇక సాంప్రదాయ చీర కట్టును తలపిస్తూనే, ఎంతో ఈజీగా, స్టైలిష్‌గా క్యారీ చేసేలా ఈ డ్రెస్‌ను ప్లాన్ చేశారు. ఈ రెడ్ కలర్ అవుట్‌ఫిట్ శృతి గ్లామర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
స్టైలిష్ కేప్ జాకెట్ హైలైట్:
ఈ శారీకి మరింత రాయల్ అండ్ మోడ్రన్ లుక్ తెచ్చింది ఆమె వేసుకున్న కేప్ జాకెట్.ఇక చిన్నగా, ఓపెన్-ఫ్రంట్ మోడల్‌లో ఉన్న ఈ రెడ్ కేప్ జాకెట్‌పై భుజాలు, చేతుల భాగంలో ఎంతో అందంగా 'కట్-దానా' ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఈ డిజైన్ శృతి లుక్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
మెరిసిపోతున్న డైమండ్ జ్యువెలరీ:
ఈ రాయల్ రెడ్ లుక్‌కు పర్‌ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా 'అత్రాంగి డిజైన్స్' బ్రాండ్‌కు చెందిన సిల్వర్ మరియు డైమండ్ నగలని శృతి ధరించింది. ఇక చేతికి సింపుల్ బ్రాస్లెట్, స్టైలిష్ రింగ్స్ వేసుకుని తన సింప్లిసిటీని చూపిస్తూనే.. గ్లామర్ డోస్ ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేసుకుంది.
వరుస హిట్లు.. క్రేజీ ప్రాజెక్ట్‌లు:
గత ఏడాది 'కూలీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతి హాసన్.. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సరసన 'ఆకాశంలో ఒక తార' అనే భారీ పాన్-ఇండియా సినిమాలో నటిస్తోంది. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు హిందీలో పాపులర్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే సీజన్ 2' లో కూడా శృతి ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తోంది.
ఎప్పుడూ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను పరిచయం చేసే శృతి హాసన్.. ఈసారి కూడా రెడ్ కలర్ ఫ్యూజన్ శారీతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే, ఇలాంటి హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉండే శృతి.. రాబోయే సినిమాలతో ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.