రజనీకాంత్, కమలహాసన్ మల్టీస్టారర్ మూవీపై శృతిహాసన్ కామెంట్!

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ మల్టీస్టారర్ కాంబినేషన్‌గా రాబోతున్న ప్రాజెక్ట్ ‘KHxRK’

Update: 2026-06-20 06:05 GMT

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ మల్టీస్టారర్ కాంబినేషన్‌గా రాబోతున్న ప్రాజెక్ట్ ‘KHxRK’. లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై శృతి హాసన్ స్పందిస్తూ అసలు విషయం తెలిపింది..ఆ వివరాలు ఇలా వున్నాయి..

ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో నేను లేను.. క్లారిటీ ఇచ్చిన శృతి:

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘KHxRK’ సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను శృతి హాసన్ పూర్తిగా ఖండించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "నేను ఇటీవల మా నాన్నగారిని, రజని గారిని కలిసిన విషయం నిజమే.. కానీ నేను ఈ సినిమాలో నటించడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదు" అని స్పష్టం చేస్తూ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

నెల్సన్ సార్ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి:

ఇక తాను ఈ సినిమాలో లేకపోయినా.. మిగతా అందరిలాగే ఈ ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్లు శృతి హాసన్ తెలిపింది. "ఇద్దరు దిగ్గజాలను పెట్టి నెల్సన్ సార్ ఈ సినిమా కోసం ఎలాంటి అద్భుతాలను సిద్ధం చేశారో, స్క్రీన్‌పై ఎలాంటి కొత్త విషయాలను చూపించబోతున్నారో చూడాలని నేను కూడా చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను" అంటూ డైరెక్టర్‌పై తనకున్న నమ్మకాన్ని బయటపెట్టింది.

'కూలీ' తర్వాత రజినీ సార్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయా:

ఇక గత ఏడాది రజినీకాంత్‌తో కలిసి ‘కూలీ’ సినిమాలో నటించిన శృతి, ఇటీవల ‘పెద్ది’ మూవీలో ఐటమ్ సాంగ్‌తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. రజినీకాంత్ గురించి మాట్లాడుతూ.. "కూలీ సినిమాకు పనిచేసిన తర్వాత, వ్యక్తిగతంగా నేను రజినీ సార్‌కు చాలా పెద్ద అభిమానిగా మారిపోయాను. ఇప్పుడు మా నాన్నగారిని, రజినీ సార్‌ని వెండితెరపై ఒకేసారి కలిసి చూడటం అనేది చిత్ర పరిశ్రమకు ఒక నిజమైన పండుగలా ఉండబోతోంది" అని ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చింది.

చేతినిండా భారీ ఆఫర్లతో ఫుల్ బిజీ:

ఈ మల్టీస్టారర్‌లో లేకపోయినా శృతి హాసన్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ.. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్-2’ లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.

శృతి హాసన్ ‘KHxRK’ సినిమాలో లేదనే వార్త ఆమె అభిమానులను కాస్త నిరాశపరిచినా, కమల్-రజినీ కాంబోపై ఆమె చేసిన కామెంట్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఏదేమైనా ఇండియన్ స్క్రీన్‌పై ఇద్దరు లెజెండ్స్ కలిసి చేయబోయే ఆ పండుగను కళ్లారా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు ఎప్పుడు క్యూ కడతారా అని ఇండస్ట్రీ మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది..

Tags:    

Similar News