ఆ న‌టికి ఛాన్స్ ఇచ్చింది రామోజీరావు!

టాలీవుడ్ లో శ్రియ శ‌ర‌న్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తోంది.;

Update: 2025-09-02 23:30 GMT

టాలీవుడ్ లో శ్రియ శ‌ర‌న్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తోంది. స్టార్ హీరోలెంద‌రితోనూ క‌లిసి ప‌ని చేసింది. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కిం చుకుంది. న‌వ‌త‌రం హీరోల‌తోనూ సినిమాలు చేయ‌డం త‌న‌కు మాత్ర‌మే సాద్య‌మని ప్రూవ్ చేస్తోంది. పెళ్లై నా..ఓ బిడ్డ‌కు త‌ల్లైనా ఇప్ప‌టికీ అదే చ‌రిష్మాతో ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతోంది. ఓ న‌టిగా ఇంత లాంగ్ కెరీర్ ని కొన‌సాగించ‌డం అంత సుల‌భం కాదు. 40 ఏళ్లు దాటినా చెక్కు చెద‌ర‌ని అందంతో యువ‌త గుండెల్లో వీణ మ్రోగించ‌డం శ్రియ‌కు మాత్రమే చెల్లింది.

ఆ యాడ్ తో వెలుగులోకి:

ద‌క్షిణాదిన దాదాపు అన్ని భాష‌ల్లోనూ న‌టించింది. బాలీవుడ్ లోనూ సైతం త‌న‌దైన ముద్ర వేసే ప్ర‌య త్నం చేసింది కానీ అక్క‌డ అనుకు న్నంత‌గా స‌క్స‌స్ అవ్వ‌లేదు. మ‌రి ఇంత‌టి గొప్ప ప్ర‌యాణానికి బీజం ఎలా ప‌డిందంటే? అందుకు దివంగ‌త నిర్మాత‌, రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు అని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రియ తాజాగా తెలిపింది. `ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చద‌వుతోన్న రోజు ల్లోనే క్యాంప‌స్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొన్న‌ట్లు గుర్తు చేసుకుంది. అలా ఓ డాన్స్ ఈవెంట్ లో పాల్గొంది.

మెయిన్ లీడ్ కంటే శ్రియ హైలైట్:

అదే స‌మ‌యంలో ఓ మ్యూజిక్ యాడ్ వీడియో కోసం ఒకరు అవ‌స‌రం కావ‌డంతో కాలేజ్ టీచ‌ర్ ప‌ట్టు బ‌ట్ట‌డంతో శ్రియ డాన్సు చేసింది. `కెమెరా ముందుకు రావ‌డం అదే తొలిసారి. అయినా త‌న‌దైన ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంది. ఆ యాడ్ చూసిన త‌ర్వాత రామోజీరావు గారు `ఇష్టం` సినిమాలో అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలిపింది. `ఇష్టం` చిత్రం 2001లో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. అనంత‌రం నాగా ర్జున హీరోగా న‌టించిన `సంతోషం` చిత్రంలో సెకెండ్ లీడ్ పోషించింది. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో? అందులో పోషించిన మెయిన్ లీడ్ కంటే శ్రియ హైలైట్ అయింది.

ఇప్ప‌టికీ అదే దూకుడు:

అనంత‌రం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన `చెన్న కెశ‌వ‌రెడ్డి`లో న‌టించింది. అటుపై త‌రుణ్ హీరోగా న‌టించిన `నువ్వే నువ్వే`లో న‌టించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. అదే స‌మ‌యంలో బాలీవుడ్ లో కూడా లాంచ్ అయింది. అనంత‌ర‌మే చిరంజీవి హీరోగా న‌టించిన `ఠాగూరు`లో సెకెండ్ లీడ్ పోషించింది. అక్క‌డ నుంచి శ్రియ కెరీర్ వెనక్కి తిరిగి చూడ‌కుండా సాగిపోయింది. హీరోయిన్ గా వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ అయింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన కోలీవుడ్ చిత్రం `రెట్రో`లోనూ స్పెష‌ల్ సాంగ్ తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తేజ సజ్జా హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `మిరాయ్` లోనూ న‌టిస్తోంది.

Tags:    

Similar News