ఉగ్రదాడి వల్ల శ్రేయా కాన్సర్ట్ క్యాన్సిల్
ఇప్పుడదే దారిలో శ్రేయా ఘోషల్ కూడా తన మ్యూజికల్ కాన్సర్ట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది.;
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి తర్వాత దేశంలోని పరిస్థితుల్లో చాలానే మార్పులొచ్చాయి. పలు నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ఉండటంతో ఇప్పటికే షెడ్యూల్ అయిన పలు కార్యక్రమాలు క్యాన్సిల్ అవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ సింగర్స్ కూడా తమ మ్యూజిక్ కాన్సర్ట్స్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సింగర్ అర్జిత్ సింగ్ ఏప్రిల్ 27న చెన్నైలో జరగాల్సిన షో ను రద్దు చేయగా, ఇప్పుడదే దారిలో శ్రేయా ఘోషల్ కూడా తన మ్యూజికల్ కాన్సర్ట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. శ్రేయా కాన్సర్ట్ ఇవాళ సూరత్ లో జరగాల్సింది.
ఆల్రెడీ టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి. అయితే టికెట్ కొనుక్కున్న ప్రతీ ఒక్కరికీ తిరిగి ఆ డబ్బును రీఫండ్ చేస్తామని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. పహల్గాం విషాదం, ఆ తర్వాత దేశంలో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తమ కాన్సర్ట్ ను క్యాన్సిల్ చేస్తున్నామని, అందరూ పరిస్థితులను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని షో నిర్వాహకులు తెలిపారు.
ఇప్పటికే శ్రేయా ఘోషల్ ఆల్ హార్ట్స్ టూర్ పేరుతో దేశ విదేశాల్లో మ్యూజికల్ కాన్సర్ట్ లు నిర్వహిస్తూ వస్తోంది. ఆల్రెడీ హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరులో మ్యూజిక్ షో లు చేసిన శ్రేయా ఇవాళ సూరత్ లో జరగాల్సిన కాన్సర్ట్ ను క్యాన్సిల్ చేసింది. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా శ్రేయా తన కాన్సర్ట్ ను క్యాన్సిల్ చేయడాన్ని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా హుకూమ్ పేరుతో వరల్డ్ టూర్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మే 31న బెంగుళూరులో జరగనున్న కాన్సర్ట్ కోసం టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, గంటలోనే టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి. దీంతో ఆ ఆదరణను చూసి జూన్ 1వ తేదీన కూడా అనిరుధ్ కాన్సర్ట్ ను కంటిన్యూ చేస్తామని టీమ్ ప్రకటించింది. కానీ ఈలోగా ఉగ్రదాడి జరగడంతో రెండో రోజు కాన్సర్ట్ టికెట్స్ ను వాయిదా వేసి, టికెట్ సేల్స్ కు కొత్త డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని అనిరుధ్ టీమ్ చెప్పింది.