ఇటలీలో షోలే రీ-రిలీజ్ ప్రీమియర్!
టాలీవుడ్ లో మొదలైన రీ-రిలీజ్ ల ట్రెండ్ బాలీవుడ్ ని కూడా తాకిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓల్డ్ క్లాసిక్ చిత్రాలు అక్కడా రిలీజ్ అయి మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.;
టాలీవుడ్ లో మొదలైన రీ-రిలీజ్ ల ట్రెండ్ బాలీవుడ్ ని కూడా తాకిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓల్డ్ క్లాసిక్ చిత్రాలు అక్కడా రిలీజ్ అయి మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ కు లేని సమయంలో రీ-రిలీజ్ లతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడం పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ షోలే రీ-రిలీజ్ కు రంగం సిద్ద మవుతోంది.
దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ-రిలీజ్ కు రావడం విశేషం. ఈ చిత్రం రీ-రిలీజ్ కూడా ఎంతో ప్రతి ష్టాత్మకంగా జరుగుతుంది. రిలీజ్ కుసంబంధించిన పనులు మూడేళ్లగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సినిమాకు సంబంధించి రీ స్టోరేషన్ పనులు జరుగుతున్నాయి. ఇండియాతో పాటు లండన్ థియేటర్లలో...స్టూడియోస్ లో స్టోర్ చేసిన రీల్స్ నుంచి ఉత్తమ క్వాలిటీ విజువల్స్ తో కొత్త వెర్షన్ సిద్దమవుతుంది.
అందుకు గానూ కొంత బడ్జెట్ కేటాయించి ఎక్కడా రాజీ పడకుండా పనులు నిర్వహిస్తున్నారు. రీ-రిలీజ్ ను కూడా ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఇటలీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అంతకు ముందు కొన్ని ప్రీమియర్లు కూడా ఆదేశంలో ప్లాన్ చేస్తున్నారుట. అక్కడ ప్రీమియర్ కు బాలీవుడ్ నుంచి కొంత మంది సెలబ్రిటీలను కూడా స్పెషల్ ప్లైట్ లో తీసుకెళ్తారుట.
అనంతరం ఇండియాలో `షో`లే రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక్కడ కూడా చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం హిందీలోనే కాకుండా పాన్ ఇండియా లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారుట. మొత్తానికి మారిని ట్రెండ్ కుతగ్గట్టు షోలో రీ-రిలీజ్ భారీ ఎత్తున ఉంటుం దని తెలుస్తోంది.