• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గామి'శివమ్.. మరో మాయ...

'గామి'శివమ్.. మరో మాయ సామీ!

| ఇక తాజాగా మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. పాటలో అఘోరా పాత్రలో ఉన్న విశ్వక్ జీవిత ప్రయాణం అలాగే అతని సమస్యను జయించే విధంగా ఎన్నో భావాలు ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-03-04 17:46 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి మూవీ చేసినా అందులో తన పాత్ర సరికొత్త తరహాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వక్ లైనప్ లో ఉన్న వాటిలో గామి అయితే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా నెవ్వర్ బిఫోర్ విజువల్స్ తో సినిమాపై అంచనాలు పెంచాయి. విద్యాధర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అడ్వెంచర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే మంచి బజ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆ తరువాత అదే లెవెల్లో అప్డేట్స్ వాదులుతోంది.

ఇక తాజాగా మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. పాటలో అఘోరా పాత్రలో ఉన్న విశ్వక్ జీవిత ప్రయాణం అలాగే అతని సమస్యను జయించే విధంగా ఎన్నో భావాలు ఉన్నాయి. శంకర్ మహదేవన్ గానం పాటకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మానవ స్పర్శను తట్టుకోలేని అతని జీవిత ప్రయాణం శివ స్మరణతో ఎంతవరకు సాగింది అనే అంశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

మొత్తానికి ఈ పాటతో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. "అతడి అతి పెద్ద భయం మానవ స్పర్శ. అతడి లోతైన కోరిక కూడా మానవ స్పర్శ" అంటూ మూవీ ట్యాగ్ లైన్ క్యూరియాసిటీ పెంచింది. "ఓ వ్యక్తి విభిన్నమైన కథ.. అతిపెద్ద భయాన్ని అధిగమించేందుకు అతడి ప్రయాణం" అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేస్తున్నప్పుడు క్లారిటీ ఇచ్చారు.

ఇక కార్తీక్ శబరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పిస్తోంది. గామి సినిమాలో హీరోయిన్ చాందినీ చౌదరి మరొక కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ఎంజీ అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా నాలుగేళ్ళ క్రితమే సెట్స్ పైకి వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

శంకర్ అనే అఘోర పాత్రలో విశ్వక్ నటిస్తున్నారు. అలాగే అతను ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే వర్క్ చేసినట్లు చెప్పాడు. సినిమాలో విజువల్స్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయట. కథ ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉంటుందని అన్నారు. ఇక సినిమా వరల్డ్ వైడ్ మార్చి 8న విడుదల కాబోతోంది.

Full View
Tags:    
  • Tollywood 
  • Gaami 
  • Gaamimovie 
  • Vishwaksen 
  • Vidyadharkaghya 
  • Karthiksabarish 
  • Vcelluloidbanner 
  • Shiva 
  • Shivamsong 
  • Spiritofgaami 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS