పెద్ది న్యూ పోస్టర్: గౌర్ నాయుడు వచ్చేశాడు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-07-12 05:41 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో చరణ్‌తో పాటు జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాస్‌, స్పోర్ట్స్‌, విలేజ్ ఎమోషన్స్‌ తో వస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో ఒక భాగమే.

సినిమాలోని భారీ బడ్జెట్‌, గ్లోబల్ లెవెల్ టెక్నికల్ టీమ్‌తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వర్క్ చేస్తున్నాడు. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్‌గా మారనుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ పోస్టర్‌లో శివరాజ్ కుమార్ సీరియస్ లుక్‌లో కనిపించారు. చెవి దగ్గర రింగ్‌, పొడవాటి మీసాలతో ఆయన లుక్ ఇంటెన్స్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. బ్యాక్ డ్రాప్‌లో ఉండే గ్రామీణ నేపథ్యం ఆయన పాత్ర బలాన్ని సూచిస్తోంది. “గౌర్ నాయుడు” అనే పేరుతో ఆయన పాత్రను పరిచయం చేశారు మేకర్స్.

ఈ గౌర్ నాయుడు పాత్ర పవర్‌ఫుల్ గా ఉండబోతుందన్న అంచనా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామంలో ఓ పెద్ద వ్యక్తిగా, ప్రజలపై అధికారం కలిగి ఉండే పాత్రగా గౌర్ నాయుడు డిజైన్ చేశారని టాక్. చరణ్ పాత్రతో ఈయనది ఘర్షణ పూరితమైన కోణంగా ఉండబోతుందంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. శివరాజ్ కుమార్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాత్ర సినిమాకు మరింత బలం చేకూర్చనుంది.

ఇక సినిమా కథలో జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనున్నారు. జగపతిబాబు, దివ్యేందు శర్మ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా పాత్రలను త్వరలోనే పరిచయం చేయనున్నట్టు సమాచారం. బుచ్చిబాబు సాన ఇప్పటికే కథను చాలా భావోద్వేగంగా రాసినట్టు సమాచారం. మాస్, స్పోర్ట్స్ డ్రామా జానర్‌కి ఇది వినూత్నంగా ఉంటుందని యూనిట్ చెబుతోంది. పెద్ది సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడం విశేషం. మేకర్స్ ఇప్పటికే భారీ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

Tags:    

Similar News