గజినీని గుర్తు చేస్తే మాత్రం..!

కోలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరో శివ కార్తికేయన్. అతను చేస్తున్న సినిమాలు మాక్సిమం సూపర్ హిట్లు అందుకుంటున్నాయి.;

Update: 2025-08-16 04:20 GMT

కోలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరో శివ కార్తికేయన్. అతను చేస్తున్న సినిమాలు మాక్సిమం సూపర్ హిట్లు అందుకుంటున్నాయి. లాస్ట్ ఇయర్ అమరన్ అనే సినిమాతో ఏకంగా 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం మురుగదాస్ తో మదరాసి సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్. ఎప్పుడో కత్తి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మురుగదాస్ తన విక్రమార్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో చాలా సినిమాలు చేసి ఫెయిల్ అవుతూ వచ్చాడు మురుగదాస్.

మదరాసి గజినీ లాంటి లవ్ స్టోరీ..

ఐతే మదరాసి సినిమా మీద మాత్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు మురుగదాస్. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో మదరాసి గజినీ లాంటి లవ్ స్టోరీ ఉంటుందని చెప్పాడు. మురుగదాస్ సెన్సేషనల్ సినిమాల్లో గజినీ ఒకటి. ఆ సినిమా పేరు విన్నా చాలు ఆ సినిమా రోజుల్లోకి వెళ్లిపోతారు. సో గజినీ సినిమా గుర్తు చేసేలా మదరాసి ఉంటే మాత్రం ఇక ఆలోచించాల్సిన పనిలేదు.

మదరాసి సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాఫ్ కథతో వస్తుంది. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. శివ కార్తికేయన్, రుక్మిణి ఇద్దరి లవ్ స్టోరీ సినిమాకు చాలా కీలకంగా ఉంటుందట. అంతేకాదు మరోపక్క పొలిటికల్ నేపథ్యంతో కథ నడుస్తుందట. మొత్తానికి ఆడియన్స్ అటెన్షన్ కోసమో లేక నిజంగానే గజినీని గుర్తు చేసేలా మదరాసి లవ్ స్టోరీ ఉంటుందా అన్నది తెలియదు కానీ. గజినీ పేరు చెప్పి మదరాసి సినిమాపై హ్యూజ్ బజ్ పెంచేస్తున్నారు మురుగదాస్.

సల్మాన్ ఖాన్ తో సికందర్..

ఈ డైరెక్టర్ తెలుగులో స్టాలున్, స్పైడర్ సినిమాలు చేశాడు కానీ రెండు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఐతే సల్మాన్ ఖాన్ తో సికందర్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్న మురుగదాస్ మదరాసితో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సెప్టెంబర్ 5న మదరాసి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే సెప్టెంబర్ 5న తేజా సజ్జ మిరాయ్, అనుష్క ఘాటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మదరాసికి ఈ రెండు సినిమాల నుంచి గట్టి పోటీ ఏర్పడుతుంది.

మదరాసి సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన ఈ అమ్మడు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుంది. ఓ పక్కె ఎన్ టీ ఆర్ డ్రాగన్ సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేయగా మదరాసి సినిమాలో కూడా తన యాక్టింగ్ తో మెప్పిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News