'శివ' బాక్సాఫీస్.. 35 ఏళ్ల సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్సా?

తెలుగు సినిమాల్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ చాలా జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పాత బ్లాక్‌బస్టర్లు థియేటర్లలోకి రావడం, మంచి వసూళ్లు సాధించడం చూస్తూనే ఉన్నాం.;

Update: 2025-11-15 15:50 GMT

తెలుగు సినిమాల్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ చాలా జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పాత బ్లాక్‌బస్టర్లు థియేటర్లలోకి రావడం, మంచి వసూళ్లు సాధించడం చూస్తూనే ఉన్నాం. అయితే, కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని దశాబ్దాలు గడిచినా తమ క్రేజ్‌ను నిలబెట్టుకుంటాయి. ఆ కోవలోకే వస్తుంది అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ 'శివ'.




దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని, ఇటీవలే సరికొత్త టెక్నాలజీతో మళ్లీ థియేటర్లలోకి తీసుకువచ్చారు. పాత ప్రింట్‌ను కాకుండా, సినిమాను పూర్తిస్థాయిలో 4Kకు రీస్టోర్ చేసి, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో అప్‌గ్రేడ్ చేశారు. ఈ కొత్త అనుభూతిని పొందేందుకు అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి తరం ఆడియన్స్ కూడా థియేటర్లకు ఆసక్తి చూపించారు.

ఈ క్రమంలో, 'శివ' 4K వెర్షన్‌కు మొదటి రోజు వచ్చిన స్పందనను తెలియజేస్తూ చిత్ర బృందం అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రీ రిలీజ్, తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ఆ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఒక పాత సినిమా రీ రిలీజ్‌కు, అందులోనూ ఇదివరకే చాలాసార్లు టీవీల్లో, ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం డీసెంట్ ఓపెనింగ్‌గానే చెప్పాలి.

35 ఏళ్ల నాటి సినిమాకు కూడా తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడానికి కారణం, ఆ సినిమాకు ఇప్పటికీ ఉన్న "కల్ట్" ఫాలోయింగే. ముఖ్యంగా కొత్త డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌లో ఇళయరాజా అందించిన ఐకానిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినడం, నాగార్జున "సైకిల్ చైన్" లాంటి ఫేమస్ సీన్లను 4K రిజల్యూషన్‌లో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోంది.

ఈ కొత్త వెర్షన్‌లో కొన్ని పాటల నిడివిని తగ్గించి, సినిమా రన్‌టైమ్‌ను కాస్త వేగంగా మార్చడం కూడా ప్రేక్షకులకు నచ్చిందని టాక్. కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ, 'శివ'ను మొదటిసారి థియేటర్‌లో చూస్తున్న కొత్త తరం ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. మొత్తంగా, 'శివ' 4K రీ రిలీజ్‌కు దక్కిన ఈ 2.5 కోట్ల+ ఓపెనింగ్, కంటెంట్ ఉన్న కల్ట్ క్లాసిక్ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదని మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News